




Best Web Hosting Provider In India 2024

తెలంగాణలోని స్కూళ్లలోనూ యూ సీటింగ్.. ఇక నో బ్యాక్ బెంచర్స్!
తెలంగాణలో సర్కారు బడుల్లోనూ యూ సీటింగ్ మెుదలుపెట్టారు. దీనిద్వారా విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో స్కూళ్లో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చున్నారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచర్ కల్చర్ తొలగించడానికి ఈ సీటింగ్ అమరికను అవలంబిస్తున్నారు.
తెలంగాణలోని జనగాం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు యూ ఆకారపు సీటింగ్‌ను మెుదలుపెట్టాయి. మలయాళ సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ ఆధారంగా పాఠశాలలు ఈ సీటింగ్‌ను ఫాలో అవుతున్నాయి. దీనిద్వారా బ్యాక్ బెంచ్ విధానానికి ముగింపు పలుకుతున్నాయి. యూ ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
‘తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్‌గా, కలుపుకొనిపోయేలా, ప్రభావవంతంగా మార్చడమే మా లక్ష్యం. యూ సీటింగ్ అంటే విద్యార్థులు ఎలా కూర్చుంటారో మాత్రమే కాదు, వారు ఎలా నేర్చుకుంటారు, నిమగ్నమై ఉంటారు. అభివృద్ధి చెందుతారు.’ అని కూడా చూపిస్తుందని జనగాం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రతి విద్యార్థి కనిపిస్తాడు. ఉపాధ్యాయులు కళ్ళలోకి చూస్తూ పిల్లలందరూ నిమగ్నమై ఉన్నారని నిర్ధారించుకోవచ్చు. తరగతి గదిలో సమానత్వం. ఇక బ్యాక్‌బెంచర్లు ఉండరు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు. బోర్డు సరిగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు చూసినట్లు, విన్నట్లు, మద్దతు ఇచ్చినట్లు భావిస్తారు. ఉపాధ్యాయుని వైపు దృష్టిని ఆకర్షిస్తుంది. క్రమశిక్షణను పెంపొందిస్తుంది. విద్యార్థులు సహకరించుకోవచ్చు. ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్న విద్యార్థులను త్వరగా గుర్తించి, సకాలంలో సహాయం అందించగలరు.
ఈ విధానం ద్వారా బ్యాక్ బెంచర్ అనే ఫీలింగ్ ఏ విద్యార్థిలోనూ ఉండదు. యూ ఆకారంలో సీటింగ్ వలన ప్రతీ విద్యార్థిని దగ్గరగా చూడొచ్చు. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరితో ఉపాధ్యాయులు ఇంటరాక్ట్ అవ్వొచ్చు. డిజిటల్ అభ్యాస సాధనాలు ఇప్పటికే తరగతి గది అనుభవాలను మెరుగుపరుస్తుండటంతో యూ ఆకారపు సీటింగ్ విద్యార్థులకు మరో కోణాన్ని చూపిస్తుంది.
యూ సీటింగ్ ద్వారా విద్యార్థులతో టీచర్ల ముఖాముఖీ సులభం కానుంది. ప్రతీ విద్యార్థి ఏం చేస్తున్నాడో చూసి వారి ఏకాగ్రతకు చర్యలు తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రతీ విద్యార్థితో మాట్లాడటం, వారి మాట వినడం, చర్చించేందుకు సాయపడుతుంది. గ్రూప్ చర్చలు కూడా ఈజీగా అవుతాయి. విద్యార్థులు నేర్చుకునేందుకు ఆసక్తి ఎక్కువ చూపిస్తారు.
టాపిక్