





Best Web Hosting Provider In India 2024

హాలీవుడ్ హాట్ బ్యూటీ.. అందం తగ్గకుండా ఉండేందుకు లేజర్ ట్రీట్మెంట్.. ఏంజెలీనా జోలీ యాంటీ ఏజింగ్!
ఏంజెలీనా జోలీ.. ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడు. ఈ భామది హాలీవుడ్ అయినా.. మన మూవీ ప్రేమికులకు ఆమె సూపరిచతమే. అందంతో, స్టంట్స్ తో ఇంగ్లీష్ సినిమాల్లో అదరగొడుతోంది. అయితే ఆమె వయసు పెరుగుతున్నా అందం తగ్గకుండా ఉండేందుకు చికిత్స చేయించుకుందని తెలిసింది.
ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గడం కామనే. అందుకే హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే చేతి నిండా సినిమాలు చేసేస్తారు. వయసు పెరిగిన భామలకు ఛాన్స్ లు తగ్గిపోతాయి. కానీ కొంతమంది ఎంత వయసు వచ్చినా తరగని అందంతో అదరగొడతారు. హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలీ కూడా అలాంటిదే. 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందంతో ఆకట్టుకుంటోంది. అయితే రాబోయే పదేళ్ల పాటు కూడా ఇలాగే ఉండాలని ఏంజెలీనా ట్రీట్మెంట్ తీసుకుందనే వార్త సంచలనంగా మారింది.
లేజర్ చికిత్స
ఇటీవల 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎడింగ్టన్ సినిమా ప్రీమియర్ సందర్భంగా 50 ఏళ్ల ఏంజెలీనా జోలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇన్ టచ్ వీక్లీలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఈ హాట్ బ్యూటీ తన గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే తీవ్రమైన లేజర్ చికిత్సలు చేయించుకుంది.
‘‘ఏంజెలీనా ఎల్లప్పుడూ సూర్యుడి నుంచి తన చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. అది ఖచ్చితంగా ఆమె యవ్వనంగా ఉండటానికి సహాయపడింది. కానీ ఆమె డెర్మటాలజిస్ట్ ఎక్స్ పర్ట్ నుంచి కూడా సాయం పొందింది. తన అందం, ఆకృతిని అలాగే ఉండటం కోసం రెండు తీవ్రమైన లేజర్ చికిత్సలు చేయించుకుంది’’ అని ఇన్ టచ్ వీక్లీ పేర్కొంది.
హెల్తీ ఫుడ్
సౌందర్య చికిత్సలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంపై ఏంజెలీనా జోలీ ఫోకస్ చేస్తోంది. ఆ ఇన్‌సైడర్ ప్రకారం.. ఆమె తన భోజనంలో ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలతో బ్యాలెన్సింగ్ ఉండేలా చూసుకుంటుంది. గతంలో పోషకాహారంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, తరచుగా ఒత్తిడి సమయంలో ఆకలిని కోల్పోతున్నప్పటికీ. ఇటీవలి సంవత్సరాలలో మరింత సమతుల్య విధానాన్ని అవలంబించడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆమె ఇప్పుడు మరింత ఆరోగ్యంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు.
సినిమాలు
చివరిసారిగా పాబ్లో లారైన్ దర్శకత్వం వహించిన మరియా చిత్రంలో ఏంజెలీనా కనిపించింది. ఆమె ఒపెరా గాయని మరియా కల్లాస్ పాత్రను పోషించింది. 1977 పారిస్‌లో ఆమె జీవితంలోని చివరి ఏడు రోజులను ఆమె గతాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరించింది. ఈ చిత్రంలో పియర్‌ఫ్రాన్సిస్కో ఫావినో, ఆల్బా రోహ్‌వాచర్, హలుక్ బిల్జినర్, స్టీఫెన్ ఆష్‌ఫీల్డ్, వలేరియా గోలినో, కోడి స్మిట్-మెక్‌ఫీ కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఆమె తదుపరి ఆలిస్ వినోకోర్ రచన, దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ డ్రామా కౌచర్‌లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో లూయిస్ గారెల్, ఎల్లా రంప్ఫ్, గారెన్స్ మారిలియర్ కూడా నటించారు.
సంబంధిత కథనం