





Best Web Hosting Provider In India 2024

అదిరేలా హరిహర వీరమల్లు క్లైమాక్స్ యాక్షన్.. స్వయంగా పవన్ కల్యాణ్ డైరెక్షన్.. మార్షల్ ఆర్ట్స్ స్పెషల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిల్మ్ హరిహర వీరమల్లు. ఈ మూవీ రిలీజ్ కోసం కల్లు కాయలు కాసేలా చూస్తున్న ఫ్యాన్స్ కు పవన్ గుడ్ న్యూస్ చెప్పారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కు తానే డైరెక్షన్ వహించానని పేర్కొన్నారు.
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో, భారీ పీరియాడికల్ డ్రామాగా రెడీ అయిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. రెండేళ్ల బ్రేక్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే సినిమాను గ్రాండ్ గా రూపొందించారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు పవన్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమా జులై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
యాక్షన్ సీక్వెన్స్
హరి హర వీరమల్లు సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు పవన్ కల్యాణ్ స్వయంగా డైరెక్షన్ వహించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో పవన్ వెల్లడించారు.
‘‘రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నా. కానీ సినిమాటిక్ గా ఫైట్లు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్నా మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ ప్రాక్టీస్ చేశా. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు డైరెక్షన్ చేశా’’ అని ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ తెలిపారు.
క్రిష్ చెప్పిన కథ
‘‘ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం చేతులు మారుతూ లండన్ మ్యూజియానికి చేరుకుంది. క్రిష్ చెప్పిన ఈ కథ నాకు నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం ఎనర్జీ మొత్తం పెట్టా. డ్యాన్స్ లు చేశా. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను. మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది’’ అని పవన్ మాట్లాడారు.
కల్పిత పాత్ర
‘‘ఇండియా ఎవరిపై దాడి చేయలేదు. మనపైనే అందరూ దాడి చేశారు. అక్బర్, షాజహాన్ గొప్ప అంటూ పుస్తకాల్లో చెప్పారు. కానీ మన విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి చెప్పలేదు. అప్పట్లో ఛత్రపతి శివాజీ ధైర్యంగా పోరాడారు. అలా ధర్మం కోసం పోరాడిన ఒక కల్పిత పాత్ర ‘హరిహర వీరమల్లు’. ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్’’ అని పవన్ చెప్పారు.
హరి హర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానుంది. పవన్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ మూవీని నిర్మించారు. 2023లో చేసిన బ్రో ఫిల్మ్ తర్వాత పవన్ ఈ సినిమాతోనే తెరపై కనిపించనున్నారు.
సంబంధిత కథనం