




Best Web Hosting Provider In India 2024

యాంకర్ రష్మికి ఏమైంది? సమస్యల్లో ఉన్నానంటూ పోస్ట్.. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరం.. ఎక్కడో కుంగిపోతున్నానంటూ..
యాంకర్ రష్మి గౌతమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. సమస్యల్లో ఉన్నానంటూ ఆమె చెప్పడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు కూడా చెప్పింది.
ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ రష్మి గౌతమ్ నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు చెప్పింది. వ్యక్తిగతం, కెరీర్ పరంగా తాను కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. మంగళవారం (జులై 22) ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్ రష్మి పోస్ట్ ఇదీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లోని ప్రముఖ యాంకర్స్ లో ఒకరు రష్మి గౌతమ్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే కొన్నాళ్లుగా రష్మి పాపులారిటీ తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడదే విషయాన్ని చెబుతూ రష్మి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఏమన్నదో చూడండి.
“అందరికీ నమస్కారం. నేను ఒక నెల రోజుల పాటు అవసరమైన డిజిటల్ డిటాక్స్ తీసుకుంటున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను. నిజంగా, సోషల్ మీడియా కొన్నిసార్లు మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది.
అయితే, నేను మరింత బలంగా, ఉత్సాహంగా తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. నేను నా శక్తిని పునరుద్ధరించుకోవాలి. దీనికి ఆత్మపరిశీలన అవసరం. ఎటువంటి ప్రచారం లేదా డిజిటల్ ప్రభావం లేకుండా ఇది జరగాలి.
నేను ఎప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల నేను కుంగిపోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం. నేను లేనప్పుడు కూడా మీ ప్రేమ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అని రష్మి పోస్ట్ చేసింది.
రష్మికి ఏమైందంటూ..
“శాంతి కలగాలి. ఈ కష్టం కూడా వెళ్లిపోతుంది. ఏదీ శాశ్వతం కాదు. చాలా బలంగా తిరిగి వస్తాను” అనే క్యాప్షన్ తో రష్మి ఈ పోస్ట్ ను అభిమానులతో పంచుకుంది. ఎప్పుడూ సరదాగా, నవ్విస్తూ ఉంటూ.. ఇన్‌స్టాలో తన ఫొటోలను షేర్ చేసే రష్మి.. సడెన్ గా ఇలాంటి పోస్ట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో లేకపోయినా నీతోనే ఉంటామని, బలంగా తిరిగి రావాలని పలువురు అభిమానులు ఆకాంక్షించారు.
సుధీర్ విషయమా అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. పలువురు ఇతర అభిమానులు ఆ వ్యక్తికి క్లాస్ పీకారు. రష్మి ఈ మధ్యే కాశీకి ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్లి వచ్చింది. అక్కడి ఫొటోలను షేర్ చేసింది. ఆమె ప్రస్తుతం వైతరిణి అనే హారర్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది. గత నెలలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు అనౌన్స్ చేసిన రష్మి.. తర్వాత ఎలా కమ్‌బ్యాక్ చేస్తుందో చూడాలి.
సంబంధిత కథనం