ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్.. మాజీ పోలీస్ తీసిన పోలీసుల స్టోరీ.. మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్.. మాజీ పోలీస్ తీసిన పోలీసుల స్టోరీ.. మూవీ ఎలా ఉందంటే?

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి తాజాగా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఓ మాజీ పోలీస్ అధికారి డైరెక్టర్ గా మారి తీసిన పోలీసుల స్టోరీ ఇది. ఈ మూవీ పేరు రోంత్ (Ronth).

ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్.. మాజీ పోలీస్ తీసిన పోలీసుల స్టోరీ.. మూవీ ఎలా ఉందంటే?

మలయాళం పోలీస్ థ్రిల్లర్ మూవీ రోంత్ (Ronth). మంగళవారమే (జులై 22) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.10 కోట్లు వసూలు చేసిన ఈ చిన్న సినిమా.. ఒక్క రాత్రిలోనే జరిగే స్టోరీ. రాత్రి గస్తీ చేసే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరుగుతుంది. కథ, కథనంతోపాటు వాళ్ల నటన ఈ సినిమాకు హైలైట్ గా చెప్పొచ్చు.

రోంత్ మూవీ స్టోరీ ఏంటంటే?

మలయాళం థ్రిల్లర్ మూవీ రోంత్ గత నెల 13న థియేటర్లలో రిలీజై మంచి హిట్ సాధించింది. రోంత్ అంటే ప్యాట్రోలింగ్ అని అర్థం. రాత్రిపూట గస్తీ నిర్వహించే కానిస్టేబుల్ దిన్నాథ్ (రోషన్ మాథ్యూ), ఎస్ఐ యోహనన్ (దిలీష్ పోతన్) చుట్టూ తిరిగే కథ ఇది. మాజీ పోలీస్ అధికారి అయిన షాహి కబీర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. దీంతో రాత్రి గస్తీ నిర్వహించే పోలీసుల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లుగా వివరించడంలో సక్సెస్ సాధించాడు.

ఈ ఇద్దరు పోలీసులు కొన్ని విషయాల్లో గొడవలు పడుతూనే రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్లకు వివిధ కేసుల గురించి కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. అప్పటికే ఈ ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో కొన్ని విషాదాలు ఎదుర్కొని ఉండటంతో ఆ కేసులతో వాళ్లు ఎమోషనల్ గానూ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి కేసుల్లో ఓ పెద్ద ఇంటికి చెందిన అమ్మాయి ప్రేమ వ్యవహారం, ప్రేమించిన వాడితో ఆమె వెళ్లిపోవడం అనే కేసు కూడా వీళ్ల దగ్గరికి వస్తుంది.

అయితే ఆ కేసు ఈ ఇద్దరి జీవితాలను ఎలా మార్చేసిందన్నదే ఈ రోంత్ మూవీ స్టోరీ. తాను ఆ హత్య చేయలేదంటూ యోహనన్ తన పై అధికారులతో మాట్లాడే సీన్ తో ఈ రోంత్ మూవీ మొదలవుతుంది. అక్కడే మూవీపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ పోలీసులు హత్య కేసులో ఇరుక్కుంటారు? అందులో నుంచి బయటపడతారా లేదా అన్నది ఈ రోంతో మూవీలో చూడొచ్చు.

రోంత్ మూవీ ఎందుకు చూడాలంటే?

రోంత్ ఓ డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్ మూవీ. ఒక్క రాత్రిలో జరిగే ఓ చిన్న కథను కూడా ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ షాహి కబీర్ సక్సెస్ అయ్యాడు. ఇందులో ప్రధానంగా లీడ్ రోల్స్ పోషించిన రోషల్ మాథ్యూ, దిలీష్ పోతన్ నటనే హైలైట్ అని చెప్పాలి. ఆ పోలీసు పాత్రల్లో వీళ్లు జీవించేశారు. తమ వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలను ఎదుర్కొంటూనే వాళ్లకు అప్పగించిన కేసులను వాళ్లు పరిష్కరించే తీరు ఆకట్టుకుంటుంది.

ఇక రోంత్ స్టోరీ కూడా భిన్నమైనదే. ఇప్పటి వరకూ ఎన్నో పోలీస్ థ్రిల్లర్స్ చూసి ఉంటాం. కానీ ఇలా పూర్తిగా ఓ రాత్రి గస్తీ నిర్వహించే పోలీసుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్లు ఎలాంటి పరిస్థితులు, కేసులు ఎదుర్కొంటారన్నది ఈ రోంత్ మూవీలో చాలా చక్కగా చూపించారు. మూవీలో వచ్చే ప్రతి సీన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది.

ఇక పూర్తిగా రాత్రి పూట సాగే స్టోరీ కావడంతో సినిమాటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నైట్ విజువల్స్ కూడా అత్యంత రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ మహేష్ మాధవన్ ను మెచ్చుకొని తీరాల్సిందే. మొత్తంగా ఈ రోంత్ మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్ అందిస్తుందనడంలో సందేహం లేదు. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను వెంటనే చూసేయండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024