



Best Web Hosting Provider In India 2024

హ్యాపీ బర్త్‌డే సూర్య: 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండేందుకు ఆయన డైట్, వర్కవుట్ సీక్రెట్స్ ఇవే
హ్యాపీ బర్త్ డే సూర్య.. నటుడు సూర్య 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన డైట్, ఫిట్‌నెస్ రొటీన్, లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం.
నటుడు సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయసులోనూ ఆయన లీన్ ఫిజిక్ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వరకు, సూర్య జీవనశైలి ఆయన సంపూర్ణ ఆరోగ్యానికి ఎంత కట్టుబడి ఉన్నారో స్పష్టం చేస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన అనుసరించే డైట్, ఫిట్‌నెస్ రహస్యాలను చూద్దాం.
‘కంగువ’ కోసం సూర్య 100 రోజుల కఠినమైన ట్రాన్స్‌ఫర్మేషన్
మే 5న ‘మన స్టార్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య, ‘కంగువ‘ సినిమాలోని ఓ భారీ యుద్ధ సన్నివేశం కోసం ఎంతటి కఠినమైన సన్నద్ధత అవసరమైందో వెల్లడించారు. ఫిట్‌నెస్ ఎప్పుడూ తన జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫర్మేషన్ తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన వాటిలో ఒకటని సూర్య అంగీకరించారు. ఈ ప్రక్రియ సులువు కాదని వివరిస్తూ, “30 ఏళ్ల వయసులో, అది చదునైన రోడ్డుపై పరుగెత్తినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు 49 ఏళ్ల వయసులో అది పర్వతం ఎక్కుతున్నట్లు ఉంది” అని చెప్పారు. దీనికి సిద్ధం కావడానికి, ఆయన 100 రోజుల కఠినమైన ప్రణాళికకు అంకితమయ్యారు. ఇది కేవలం శారీరక వ్యాయామాలకు మాత్రమే పరిమితం కాలేదు.. పూర్తి జీవనశైలి మార్పు అవసరమైంది.
40 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ గురించి..
ఆయన దినచర్యలో క్యాలరీ డెఫిసిట్ డైట్, కార్డియో సెషన్లను పెంచడం, కఠినమైన స్వీయ క్రమశిక్షణ ఉన్నాయి. తన విజయం గురించి చెబుతూ, “షూటింగ్ సమయంలో, నేను 100 రోజుల ప్రణాళికను అనుసరించాను. 100 రోజుల్లో సహజమైన పద్ధతుల్లో నేను సిక్స్ ప్యాక్ సాధించాను” అని అన్నారు.
సూర్య తనను తాను ఫుడీగా భావిస్తారు. అయితే సులభంగా బరువు పెరగని శరీర తత్వం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని చెబుతూనే, ఈ ప్రక్రియ అంత తేలిక కాదని అంగీకరించారు. దాదాపు పదేళ్ల తర్వాత సిక్స్ ప్యాక్ ఫిజిక్‌ను సాధించడం చాలా పట్టుదల, ఏకాగ్రతను డిమాండ్ చేసింది.
సూర్య గురించి
శరవణన్ శివకుమార్ సూర్యగా పాపులర్ అయ్యారు. నటుడిగా, సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. ప్రధానంగా తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా, భారతీయ సినిమాలోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందారు.