నిన్ను కోరి జులై 23 ఎపిసోడ్: శ్యామల ట్విస్ట్.. కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్.. కొరడా దెబ్బలు తిన్న తల్లీకూతురు

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జులై 23 ఎపిసోడ్: శ్యామల ట్విస్ట్.. కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్.. కొరడా దెబ్బలు తిన్న తల్లీకూతురు

నిన్ను కోరి సీరియల్ టుడే జులై 23వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ నైవేద్యంలో బొగ్గుపొడి కలపాలన్న కామాక్షి ప్లాన్ కు శ్యామల చెక్ పెడుతుంది. ముక్కుపుడక దొంగిలించి చంద్రకళను దోషిగా నిలబెట్టాలనుకునే ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. శ్రుతి, కామాక్షి కొరడా దెబ్బలు తింటారు.

నిన్ను కోరి నేటి ఎపిసోడ్

నిన్ను కోరి సీరియల్ టుడే జులై 23వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ బోనం కోసం వండిన ప్రసాదంలో కామాక్షి బొగ్గు పొడి కలుపుతుంది. కానీ ఆ ప్రసాదం బయటకు తీసేటప్పుడు బాగానే ఉండటం చూసి కామాక్షి, శ్రుతి, శాలిని షాక్ అవుతారు. కామాక్షి, శ్రుతి కలిసి వండిన నైవేద్యంలో బొగ్గు పొడి కలిపి ఉంటుంది. నీ ప్లాన్ అంతా విన్నా, అందుకే నైవేద్యాలు మార్చేశా. నువ్వు బొగ్గు పొడి కలిపాక మళ్లీ మార్చేశా అని శ్యామల ట్విస్ట్ ఇస్తుంది.

బోనాలు సమర్ఫణ

చంద్రకళ, శాలిని, శ్రుతి బోనాలు ఎత్తుకుంటారు. చంద్రకళ బోనం అమ్మవారికి సమర్పించకుండా చేయాలని శ్రుతి, కామాక్షి అనుకుంటారు. చంద్రకళని కింద పడేలా చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ చంద్రకళ చుట్టూ రక్షణగా శ్యామల ఉంటుంది. శాలిని బోనం కింద పడిపోతుండగా చంద్రకళ పట్టుకుంటుంది. చంద్రకళ విజయవంతంగా అమ్మవారికి బోనం సమర్పిస్తుంది.

ముక్కుపుడక దొంగతనం

శ్యామల కన్నుగప్పి చంద్రను డిస్టర్బ్ చేయడం మనవల్ల కాదని శ్రుతితో కామాక్షి అంటుంది. ప్లాన్ చేయమ్మ అని శ్రుతి చెప్తుంది. రాఘవయ్య అనే ఓ వ్యక్తి అమ్మవారికి వజ్రాల ముక్కుపుడక సమర్పించడానికి వస్తాడు. ఆ ముక్కపుడక అమ్మవారికి చేరకుండా చేసి, ఆ నిందను చంద్రకళపై వేయాలనే కామాక్షి, శ్రుతి అనుకుంటారు. అందరూ కళ్లు మూసుకున్నాక ముక్కు పుడక తీసిన కామాక్షి.. దాన్ని చంద్రకళ కొంగుకు కట్టాలని ప్రయత్నిస్తుంది.

కామాక్షి దొంగ

కానీ అందరూ కళ్లు తెరిచే సరికి ముక్కు పుడక మాయమవుతుంది. వెంటనే ఓ మహిళకు అమ్మవారు పూనుకుంటారు. కొంతమంది దొంగ భక్తి చూపిస్తున్నారు. వాళ్లే నా ముక్కు పుడక కాజేశారు. వాళ్లు ఇద్దరు తల్లీకూతుళ్లు. ఒకరు కుంకుమ రంగు బట్టలు, మరొకరు ఆకుపచ్చ రంగు బట్టలు కట్టుకున్నారు. పెద్దింటి మనుషులే కానీ కుంచిత బుద్ధి అని ఆ మహిళ రంగం చెప్తుంది.

కామాక్షి నువ్వేనా ముక్కు పుడక దొంగతనం చేసింది అని శ్యామల అడుగుతుంది. మేం తీయలేదు అని చెప్తుండగానే శ్యామల్ చెక్ చేస్తుంది. కామాక్షి చేతిలో ముక్కు పుడక ఉండేసరికి అందరూ షాక్ అవుతారు. దీంతో అందరూ కోప్పడతారు. ఇలాంటి వాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టాలని భక్తులు అంటారు. అమ్మవారి వస్తువు తాకారు కాబట్టి అందుకు తగిన దండన ఆ అమ్మవారే విధిస్తుందని శ్యామల అంటుంది.

కొరడా దెబ్బలు

వీళ్లు వేసిన పాపానికి శిక్ష ఏమిటో నువ్వో చెప్పు అని అమ్మవారు పూనిన మహిళను శ్యామల అడుగుతుంది. దేహశుద్ధి జరగాలి, ఒకరినొకరు 50 కొరడా దెబ్బలు కొట్టుకోవాలి. కాదంటే శిక్ష ఇంకా కఠినంగా మారుతుంది. శిక్ష అనుభవించక తప్పదు అని ఆ మహిళ చెప్తుంది. మా తప్పును ఒప్పుకుంటున్నామని శ్రుతి చెప్తుంది. కామాక్షి, శ్రుతి ఒకరికొకరు కొరడా దెబ్బలు కొట్టుకుంటారు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024