ఓటీటీలో థ్రిల్లర్లదే హవా.. జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో వాటిదే జోరు.. ఉత్కంఠ రేపే సినిమా, సిరీస్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో థ్రిల్లర్లదే హవా.. జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో వాటిదే జోరు.. ఉత్కంఠ రేపే సినిమా, సిరీస్

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతోంది. ఎడతెగని ఉత్కంఠ పంచుతూ, సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఓ థ్రిల్లర్ మూవీ, వెబ్ సిరీస్ దూసుకెళ్తున్నాయి.

ఓటీటీ ట్రెండింగ్ లో థ్రిల్లర్లు (x/jiohotstar)

ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా, వెబ్ సిరీస్ ఓటీటీని ఊపేస్తున్నాయి. జియోహాట్‌స్టార్‌ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఆ సినిమా ‘డీఎన్ఏ’ అయితే, ఆ సిరీస్ ఏమో ‘స్పెషల్ ఓపీఎస్ 2’. ఈ రెండు కూడా జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ట్రెండింగ్ లో అదరగొడుతున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. తెలుగులో థియేటర్లలో మై బేబీ టైటిల్ తో జులై 18న రిలీజ్ అయింది. ఆ తర్వాతి రోజు అంటే జులై 19న ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అధర్వ మురళి, నిమిషా సజయన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

ట్రెండింగ్ లో

పుట్టగానే మారిపోయిన తమ బిడ్డ కోసం కోసం వెతికే తల్లిదండ్రుల కథనే డీఎన్ఏ. ఇందులో థ్రిల్ కు, ట్విస్ట్ లకు కొదవలేదు. చివరకు పసి బిడ్డల అక్రమ రవాణా గుట్టు బయటపడుతుంది. జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ తెలుగు, తమిళం, మాలయాళం భాషల్లో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ తమిళం ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఇక హిందీలో అయిదో స్థానంలో, కన్నడలో రెండో స్థానంలో డీఎన్ఏ మూవీ ట్రెండ్ అవుతోంది.

సక్సెస్ ఫుల్ సీక్వెల్

జియోహాట్‌స్టార్‌ ఒరిజినల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వచ్చిన స్పెషల్ ఓపీఎస్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత స్పెషల్ ఓపీఎస్ 1.5 అంటూ నాలుగు ఎపిసోడ్లతో మినీ సిరీస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ లోనే వచ్చిన స్పెషల్ ఓపీఎస్ 2 కూడా అదరగొడుతోంది. సక్సెస్ ఫుల్ సీక్వెల్ అనిపించుకుంది. స్పెషల్ ఓపీఎస్ 2లో మొత్తం ఏడు ఎపిసోడ్లున్నాయి. ఉత్కంఠ రేపే సీన్స్ తో ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది.

కిడ్నాప్ కేసు

సైబర్ క్రైమ్ నేపథ్యంలో స్పెషల్ ఓపీఎస్ 2 తెరకెక్కింది. భారత ప్రభుత్వ టెక్ సిస్టమ్స్ ను డిజైన్ చేసే ఎక్స్ పర్ట్ కిడ్నాప్ అవుతాడు. అతణ్ని కాపాడే బాధ్యత ‘రా’ డిపార్ట్ మెంట్లోని హిమ్మత్ సింగ్ (కేకే మీనన్)కు అప్పగిస్తారు. ఇండియన్ డిజిటల్ ఎకానమీని దెబ్బతీసేందుకు సుధీర్ (తాహిర్ రాజ్ భాసిన్) ఈ కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటారు. కిడ్నాప్ కేసును ఎలా సాల్వ్ చేశారన్నదే కథ.

జులై 18 నుంచి స్పెషల్ ఓపీఎస్ 2 జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, బెంగాళీ భాషల్లో నంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. తెలుగులో మూడు, తమిళంలో ఆరు, మలయాళంలో ఎనిమిది, మరాఠీలో రెండు, కన్నడలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024