




Best Web Hosting Provider In India 2024

ఏపీ అటవీశాఖలో మరో 100 ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలివే
ఏపీ అటవీశాఖలో మరికొన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 100 . ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూలై 28 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ జూలై 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తం వంద పోస్టుల్లో బ్యాక్ లాగ్ పోస్టులు 30 ఉండగా… కొత్తగా 70 పోస్టులు ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్ష సెప్టెంబరు 7వ తేదీన నిర్వహించనున్నారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ వివరాలు
- ఉద్యోగ ప్రకటన – ఏపీపీఎస్సీ
- ఉద్యోగాల పేరు – ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
- మొత్తం ఖాళీలు – 100
- అర్హతలు – వృక్షశాస్త్రం లేదా ఫారెస్ట్ లేదా హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా ఉండి డిగ్రీ పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పట్టా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు కూడా ఉంటాయి.
- అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్లకు తగ్గకుండా ఎత్తు ఉండాలి. చాతీ 84 Cms ఉండాలి గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి. ఇక మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. 150 Cms ఎత్తు, 79 Cms తగ్గకుండా చాతీ చుట్టుకొలత ఉండాలి. గాలి పీలిస్తే ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
- దరఖాస్తు విధానం – ఆన్ లైన్
- ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 250 చెల్లించాలి. పరీక్ష ఫీజు కింద రూ. 80 చెల్లించాల్సి ఉంటంది.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 01.07.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
- నెల జీతం రూ. 32,670 – రూ. 1,01,970 మధ్య ఉంటుంది.
- ఎంపిక విధానం – స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా ఉంటుంది.
- స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ 75, జనరల్ ఫారెస్ట్రీ 75 మార్కులు ఉంటాయి.
- మెయిన్స్ మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. మూడు పేపర్లతో పాటు మరో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ – https://portal-psc.ap.gov.in/Default
మరోవైపు ఏపీ అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 691 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యా అర్హతతో వీటిని రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు
సంబంధిత కథనం
టాపిక్