




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగులో వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. డ్రగ్‌తో అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఓటీటీలోకి వస్తోంది. నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. డ్రగ్ తో అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ చూడండి.
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మూవీ మార్గన్ (maargan). ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. దీంతో నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతోంది.
మార్గన్ ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్గన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శుక్రవారం (జులై 25) నుంచి ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అదే రోజు మరో ఓటీటీలోకి వస్తోంది.
కేవలం తమిళ వెర్షన్ టెంట్‌కొట్టా ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. లియో జాన్ పాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర రూ.14 కోట్లు వసూలు చేసింది. సీరియల్ కిల్లర్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
మార్గన్ మూవీ గురించి..
మార్గన్ మూవీ ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. అమ్మాయిల హత్యల చుట్టూ తిరిగే స్టోరీ. మొదట రమ్య అనే అమ్మాయి హత్యతో కథ మొదలవుతుంది. ఓ మండే స్వభావం ఉన్న డ్రగ్ ను ఆమెలోకి ఇంజెక్ట్ చేసి చంపేస్తారు. ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగంలోకి దిగుతాడు.
పదేళ్ల కిందట అతని కూతురు కూడా ఇలాగే హత్యకు గురవడంతో అతడు ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు. అతడు అరవింద్ అనే యువకుడిని ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకుంటాడు. అతన్ని ప్రశ్నిస్తే.. కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి.
అసలు ఈ అమ్మాయిల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటికి అరవింద్ కి ఉన్న సంబంధం ఏంటి? ధృవ అసలు హంతకుడిని ఎలా పట్టుకుంటాడన్నదే ఈ మార్గన్ స్టోరీ. మార్గన్ మూవీ తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్లలో చూడని వాళ్లుంటే ఓటీటీలో చూసేయండి.
సంబంధిత కథనం