కింగ్డమ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. రికార్డు ధరకు డిజిటల్ హక్కులు.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధికం..

Best Web Hosting Provider In India 2024

కింగ్డమ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. రికార్డు ధరకు డిజిటల్ హక్కులు.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధికం..

Hari Prasad S HT Telugu

విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులపై నెలకొన్న బజ్ ఆసక్తి రేపుతోంది. విజయ్ కెరీర్లోనే అత్యధిక మొత్తం రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి.

కింగ్డమ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. రికార్డు ధరకు డిజిటల్ హక్కులు.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధికం..

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులపై తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ఓటీటీ హక్కులకు రికార్డు ధర పలికింది.

కింగ్డమ్ మూవీ ఓటీటీ హక్కులు

కింగ్డమ్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.53 కోట్లు వెచ్చించినట్లు ఓటీటీప్లే రిపోర్ట్ వెల్లడించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతేకాదు అతని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. మేకర్స్ ఈ యాక్షన్ డ్రామా కోసం సుమారు రూ.130 కోట్లు ఖర్చు చేశారు.

విజయ్ కు చాలాకాలంగా ఓ మంచి హిట్ లేకపోయినా.. కింగ్డమ్ ను భారీ బడ్జెట్ తో నిర్మించడం, నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు విజయ్ దేవరకొండతో ఇది తొలి సినిమా.

‘కింగ్డమ్ పార్ట్ 2’ ప్రస్తుతానికి వాయిదా

కింగ్డమ్ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జులై 31, 2025న థియేటర్లలోకి రానుంది. ఇదివరకే వచ్చిన వార్తల ప్రకారం, మొదటి భాగానికి లభించే స్పందనను బట్టి రెండో భాగం షూటింగ్ ఉంటుందని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు పెద్ద హిట్‌గా నిలిచాయి.

గత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను చాలా వరకు నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో మరో రెండు మూడు సినిమాలు కూడా ఇదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌తో డిజిటల్ ఒప్పందం కుదర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ‘కింగ్డమ్’ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పునర్జన్మ ఇతివృత్తం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ మూవీ టీమ్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై స్పందించడం లేదు. ఇక కింగ్డమ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024