ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఈ ఓటీటీలో చూడండి

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఈ ఓటీటీలో చూడండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో మలయాళం కామెడీ మూవీ ఆరేళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. 2019లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. మరి ఆ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఈ ఓటీటీలో చూడండి

మలయాళం బాక్సాఫీస్ కింగ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇట్టిమాని: మేడిన్ చైనా. ఈ సినిమా సెప్టెంబర్, 2019లో రిలీజైంది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ.36 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఇట్టిమాని: మేడిన్ చైనా ఓటీటీ రిలీజ్ డేట్

ఇట్టిమాని: మేడిన్ చైనా మూవీని గురువారం (జులై 24) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. బుధవారం (జులై 23) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది.

“అన్‌లిమిటెడ్ నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి. ఇట్టిమాని మేడిన్ చైనా.. ఓ నవ్వించే తెలుగు కామెడీ మీ దగ్గరికి వస్తోంది. జులై 24 నుంచి కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేయడం విశేషం.

ఇట్టిమాని: మేడిన్ చైనా మూవీ గురించి..

ఇట్టిమాని: మేడిన్ చైనా సినిమా సెప్టెంబర్ 6, 2019లో రిలీజైంది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.36 కోట్లు వసూలు చేసింది. జిబి-జోజు డైరెక్ట్ చేశారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించాడు. ఈ సినిమాలో మోహన్‌లాల్ డ్యుయల్ రోల్ పోషించాడు. ఇట్టిమాథన్, ఇట్టిమాని అనే తండ్రీకొడుకుల పాత్రలో అతడు నటించాడు. నిజానికి ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

ఐఎండీబీలోనూ కేవలం 4.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కొడుకు అయినా కూడా ప్రతిసారీ నిర్లక్ష్యంగా ఉంటూ కష్టాల్లో పడే వ్యక్తి పాత్రలో మోహన్‌లాల్ నటించాడు. ఈ సినిమా ఇప్పటికే మలయాళం ఆడియోతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.

మోహన్‌లాల్ కెరీర్లో మంచి వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. మరి ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది. వీలుంటే చూసేయండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024