
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.12-9-2022(సోమవారం) ..
ఓపెన్ టెన్త్ – ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధర్యంలో (దూర విద్యా విధానం) ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా బ్రోచర్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సమగ్ర మార్పులు తీసుకోవచ్చి , ప్రతి ఒక్కరూ ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని , విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ – ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా కూడా నాడు- నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు , అదేవిధంగా చదువు పట్ల ఆసక్తి కలిగి పలు కారణాలవల్ల చదువుకు దూరమైన వాళ్లకు ఉపయోగపడే విధంగా దూరవిద్య విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు , జిల్లా పరిషత్ పాఠశాలలో ఓపెన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభిస్తున్నామని , ముఖ్యంగా మహిళలు పలు వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు ,ఉద్యోగులు , వివిధ సంఘ సభ్యులు సామాజికంగా -ఆర్థికంగా వెనుకబడినవారు సెలవు దినాల్లో ఏర్పాటు చేసే ఈ తరగతులకు హాజరై తమ విద్యను కొనసాగించాలని సూచించారు , చదువును కొనసాగించడం వల్ల బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు నాయక్ , దూర విద్యా విధానం డైరెక్టర్ , పార్టీ కోర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ మస్తాన్ , ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు , సొసైటీ చైర్మన్ పాములపాటి రమేష్ , మండల పార్టీ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..