ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసిపి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ – కో కన్వీనర్లు ..

monditoka jagan mohan rao monditoka arun kumar
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసిపి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ – కో కన్వీనర్లు ..

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును -సంక్షేమ పథకాలను -ప్రతిపక్షాల కుట్రలను సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గా నియమింపబడిన పగిడిపాటి చైతన్య రెడ్డి -కోకన్వీనర్లతో కలిసి నందిగామ పట్టణంలోని శాసనసభ్యులు వారి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ,

ఈ సందర్భంగా సోషల్ మీడియా కన్వీనర్- కో కన్వీనర్లుగా నియమింపబడిన పగిడిపాటి చైతన్య రెడ్డికి మరియు టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు , అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను , ప్రభుత్వ పనితీరును , తెలుగుదేశం పార్టీ మరియు ఇతర ప్రతిపక్షాల కుట్రలను -కుతంత్రాలను సోషల్ మీడియా వేదికగా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని , ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వైయస్ జగన్ ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నారని , వాటిని ఢీకొట్టే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు ..

ఈ కార్యక్రమంలో కోకన్వీనర్ రమేష్ , పార్టీ నాయకులు సత్యనారాయణ ప్రసాద్ , సాంబశివరావు ,మస్తాన్ ,శివ నాగేశ్వరరావు ,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *