


Best Web Hosting Provider In India 2024

ఇది టీడీపీ సర్కారు షాక్.. ప్రజలపై వేల కోట్ల భారం: షర్మిల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలపై రూ. 17,000 కోట్ల భారం మోపిందని ఆమె విమర్శించారు.
“చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచను అని మాట ఇచ్చి, ప్రజలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే రూ. 17,000 కోట్ల భారాన్ని మోపి, ప్రజల జేబులకు చిల్లు పడేలా చేశారు” అని షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు.
అంతేకాకుండా, ఈ భారం సరిపోదన్నట్టుగా మరో రూ. 12,000 కోట్లను విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై మోపేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలపై విపరీతంగా విద్యుత్ ఛార్జీలు విధించడంలో చంద్రబాబు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘వారసుడు’ అని షర్మిల దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో కూటమి గెలిస్తే ‘విద్యుత్ ఛార్జీలలో ఒక్క రూపాయి కూడా పెరగదు’ అని, ’30 శాతం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం’ అని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. “అధికారం చేపట్టిన 14 నెలల్లోనే రూ. 29,000 కోట్ల అడ్జస్ట్‌మెంట్ ఛార్జీలను మోపుతున్నారు” అని చెప్పిన ఆమె, చంద్రబాబు ప్రజలను విద్యుత్ ఛార్జీల విషయంలో వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
ప్రస్తుతం మోపనున్న రూ. 12,000 కోట్ల భారం ప్రజలపై పడకుండా, ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, ప్రజలపై ఇప్పటికే మోపిన రూ. 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టాపిక్