వామ్మో వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, జనాలు.. వీడియో చూస్తే భయంతో గూస్ బంప్స్!

Best Web Hosting Provider In India 2024


వామ్మో వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, జనాలు.. వీడియో చూస్తే భయంతో గూస్ బంప్స్!

Anand Sai HT Telugu

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాళి అనే గ్రామంపై వరదలు ఒక్కసారిగా వచ్చాయి. దీంతో ఇళ్లు, కొంతమంది కూడా కొట్టుకుపోయారు.

ఉత్తరాఖండ్ వరదలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ధరాలి గ్రామంలోని ఖీర్ గంగా నదిలో భయంకరమైన వరద సంభవించింది. వరద కారణంగా 20 నుండి 25 హోటళ్ళు, నివాసాలు కొట్టుకుపోయాయి. స్థానికుల నుండి అందిన సమాచారం ప్రకారం 30 నుండి 50 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చు. ఖీర్ గంగా పరీవాహక ప్రాంతంలో ఎక్కడో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దాని కారణంగా ఈ వినాశకరమైన వరద సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

వరదల కారణంగా ధరాలి మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. చుట్టూ వరదలు తెచ్చిన శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్తున్నారు. వరదల కారణంగా ఖీర్ గంగా ఒడ్డున ఉన్న పురాతన కల్ప కేదార్ ఆలయం కూడా శిథిలాల కింద కూరుకుపోయినట్లు సమాచారం.

ఉత్తరకాశి జిల్లాలో మేఘాల విస్ఫోటనం కారణంగా వరదలు దారుణంగా సంభవించాయి. ఈ సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఉత్తరకాశిలోని ధరాలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించిందని, నీటి మట్టం పెరగడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని అన్నారు.

జిల్లా యంత్రాంగం, భారత సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయ కార్యకలాపాల కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ధామి చెప్పారు. ‘ప్రజలను రక్షించడానికి, వారిని సురక్షితంగా తరలించడానికి మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.’ అని అన్నారు. బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మరోవైపు ఉత్తరకాశి బాద్కోట్ తహసీల్ ప్రాంతంలోని బనాల్ పట్టిలో కురిసిన భారీ వర్షంలో చిక్కుకున్న చాలా మేకలు వరదల్లో కొట్టుకుపోయాయి. కుడ్ గడేరా పొంగిపొర్లడంతో గందరగోళం నెలకొంది. ఆగస్టు 10 వరకు రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ రోహిత్ థాప్లియాల్ తెలిపారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళవారం కూడా డెహ్రాడూన్, పౌరి, తెహ్రీ, హరిద్వార్‌లలో పాఠశాలలు మూసివేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link