షాకింగ్.. 34 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు.. జాండిస్ రావడంతోనే..

Best Web Hosting Provider In India 2024

షాకింగ్.. 34 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు.. జాండిస్ రావడంతోనే..

Hari Prasad S HT Telugu

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఓ యువ నటుడు కన్ను మూశాడు. జాండిస్ కారణంగానే సంతోష్ బాలరాజ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

షాకింగ్.. 34 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు.. జాండిస్ రావడంతోనే..

కన్నడ సినిమా ఇండస్ట్రీ నటుడు సంతోష్ బలరాజ్ (34) మంగళవారం ఉదయం బెంగుళూరులోని కుమారస్వామి లేఅవుట్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో కన్నుమూశాడు. ‘ది వీక్’ రిపోర్ట్ ప్రకారం అతడు ఉదయం 9:30 గంటల సమయంలో కాలేయం, కిడ్నీ సమస్యలతో తీవ్రమైన కామెర్లతో బాధపడుతూ తుది శ్వాస విడిచాడు. నిజానికి ఈ నటుడు గత నెలలోనే ఆసుపత్రిలో చేరాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందాడు.

కోమాలోకి వెళ్లిపోవడంతో..

కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ ఇండస్ట్రీలో ఎన్నో మంచి పాత్రలతో పేరు సంపాదించిన యువ నటుడు సంతోష్ బాలరాజ్ కన్నుమూశాడు. సంతోష్ మొదట కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించింది. కానీ పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు.

ఈ వారం మొదట్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం అతని ఆరోగ్యం క్లిష్టంగా మారి కోమాలోకి వెళ్లారని ధృవీకరించాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ, అతని అవయవాలు సహకరించలేదు. దీంతో మంగళవారం (ఆగస్ట్ 5) ఉదయం సంతోష్ తుది శ్వాస విడిచాడు.

ఎవరీ సంతోష్ బాలరాజ్?

సంతోష్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలు పోషించాడు. ‘కరియా 2’, ‘కెంప’, ‘గణప’, ‘బర్‌క్లీ’, ‘సత్య’ వంటి సినిమాలలో అతడు నటించాడు. ఈ సంతోష్ దివంగత కన్నడ చిత్ర నిర్మాత అనేకల్ బలరాజ్ కుమారుడు. అనేకల్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. సంతోష్‌కు ‘గణప’ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా అతడు వాస్తవిక, బలమైన పాత్రను పోషించాడు.

కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి సంతోష్ తన తండ్రి సాయంతోనే వచ్చాడు. అతని తండ్రి ‘కెంప’ (2009) మూవీతో సంతోష్‌ను హీరోగా పరిచయం చేశారు. ఈ కన్నడ యాక్షన్ డ్రామాలో సంతోష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దర్శన్ నటించిన హిట్ మూవీ ‘కరియా’ను నిర్మించిన అనేకల్, ఆ సినిమా సీక్వెల్ ‘కరియా 2’లో తన కొడుకును తీసుకున్నారు. దీంతో సంతోష్ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రభు శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంతోష్ ఓ నెపో కిడ్ గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. 2022 మే నెలలో ఒక రోడ్డు ప్రమాదంలో అనేకల్ బాలరాజ్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మోటారుసైకిల్ ఢీకొట్టడంతో తీవ్రమైన తల గాయాలతో మరణించారు. ఇప్పుడు సంతోష్ కూడా 34 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం ఆ కుటుంబాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024