నిన్ను కోరి ఆగస్టు 6 ఎపిసోడ్: చేయి కోసుకుని శాలిని డ్రామా..రాత్రి చంద్రకళకు అర్జున్ ఫోన్.. శ్రుతి బలి.. ఇంట్లో క్లీనింగ్

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి ఆగస్టు 6 ఎపిసోడ్: చేయి కోసుకుని శాలిని డ్రామా..రాత్రి చంద్రకళకు అర్జున్ ఫోన్.. శ్రుతి బలి.. ఇంట్లో క్లీనింగ్

నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్ లో క్రాంతిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం కోసం చాకుతో చేయి కోసుకుని డ్రామా ఆడుతుంది శాలిని. పార్ట్ నర్ షిప్ గురించి రాత్రి చంద్రకళకు ఫోన్ చేస్తాడు అర్జున్. చంద్రను టార్చర్ పెట్టాలని శ్యామల చూస్తుంది. కానీ శ్రుతి బలైపోతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్ లో చాకు పట్టుకుని చనిపోతానని శాలిని బెదిరిస్తుంది. చేయి కట్ చేసుకుంటుంది. నువ్వు శత్రువులా చూస్తుంటే ప్రతి క్షణం నరకంలా ఉంది. నేను చచ్చిపోతాను బతకను అని క్రాంతితో అంటుంది. చేయి కట్ చేసుకుని కపట ప్రేమ చూపిస్తుంది శాలిని. ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టే పని చేయని ప్రామిస్ క్రాంతి అని అంటుంది. గతాన్ని తీసేయాలని శాలిని అంటే.. అదంతా తేలిక కాదు టైమ్ పడ్తుందని చెప్పి క్రాంతి వెళ్లిపోతాడు. నాకు తెలుసు నేనెం చేస్తే నువ్వు కరుగుతావోనని శాలిని అనుకుంటుంది.

పట్టపగలు పూజ

రాత్రి అర్జున్ నుంచి చంద్రకళకు ఫోన్ వస్తుంది. పార్ట్ నర్ షిప్ కు ఓకే చెప్తుంది. ఆఫీస్ కు రమ్మని లోకేషన్ పంపిస్తాడు అర్జున్. అప్పుడే కరెంట్ పోతుంది. చీకట్లో విరాట్ కు డాష్ ఇస్తుంది చంద్ర. అప్పుడు చంద్రను పట్టుకుని రొమాంటిక్ లుక్ ఇస్తాడు విరాట్. పార్ట్ నర్ షిప్ ఓకే అని చెప్పానంటే ఆల్ ది బెస్ట్ చెప్తాడు విరాట్. ఇక మధ్యాహ్నం గంట చప్పుడు విని ఎవరు పూజ చేస్తున్నారని కనుక్కుంటుంది శ్యామల. చంద్రకళ పూజ చేస్తుందేమోనని తిడుతుంది. కానీ పూజ చేస్తుంది శ్రుతి. పూజ చేయడం చూసి షాక్ అయ్యారా? అని శ్రుతి అడుగుతుంది. ఎప్పుడు లేస్తే అప్పుడు పూజ చేస్తానని శ్రుతి అంటే.. శ్యామల, కామాక్షి మండిపడతారు.

పొగరు దించుతానని

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చంద్రకళ ఎగతాళి చేస్తుంది. నువ్వు ప్రతి దాంట్లో వేలు పెట్టకు, శ్రుతి త్వరలోనే నీకు పోటీగా తయారవుతుందని శ్యామల అంటే.. చూద్దామని చంద్ర చెప్తుంది. ఇంట్లో ఉండే పెంట మొహం చూడటం కంటే ఆఫీస్ వెళ్లడం బెటర్, నీ కూతురే పెంట మొహం అని కామాక్షితో చంద్ర అంటుంది. చంద్ర పొగరు దించుతానని ఇంట్లో బూజు అలాగే ఉందని, మురికి పోలేదని శ్యామల చెప్తుంది. మళ్లీ పని చేయమని శ్యామల అంటే సరే పిన్ని అని అంటుంది చంద్ర.

శ్రుతి క్లీనింగ్

శ్రుతితో పని చేయించేలా చంద్ర ప్లాన్ వేస్తుంది. బావతో ఉండేలా రూమ్ లో పిన్ని పర్మిషన్ ఇస్తుందని, ఇంట్లో అన్ని పనులు చేస్తానని శ్రుతి వినేలా చంద్ర అంటుంది. అన్ని పనులు చేస్తానని చంద్రతో చెప్పిన శ్రుతి, చీపురు లాక్కుంటుంది. నాకు అన్యాయం చేయకు శ్రుతి అని చంద్ర డ్రామా ఆడుతుంది. అర్థం చేసుకోలేని శ్రుతి అన్ని పనులూ చేస్తుంది. పెద్దమ్మను ఇంప్రెస్ చేద్దామని ఈ పనులన్నీ చేస్తున్నానని శాలినితో శ్రుతి చెప్తుంది. చంద్ర ఏదో ట్రిక్ ప్లే చేస్తుందని శాలిని అంటే, నేనే ట్రిక్ ప్లే చేశానని చెప్పిన శ్రుతి పనులన్నీ కంటిన్యూ చేస్తుంది.

హాస్పిటల్ నుంచి తిరిగొచ్చిన శ్యామల, కామాక్షి ఇల్లు చూసి చంద్ర పని చేసిందని అనుకుంటారు. శ్రుతి అని చంద్ర చెప్పేసరికి వద్దని అంటుంది శ్యామల. నేను చేయలేదని చెప్తుండగానే ఆపేశారని శ్రుతితో చంద్ర అంటుంది. నువ్వెందుకు చేశావే? చంద్రను టార్చర్ చేయిద్దామని చెప్పిన పని అది అని శ్రుతిపై కోప్పడుతుంది కామాక్షి. మీరు ఎంత టార్చర్ చేసినా నేను ఇల్లు వదిలి వెళ్లిపోనని శ్యామలతో చంద్ర అంటుంది. అర్జున్ ఆఫీస్ కు చంద్ర వెళ్లడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024