





Best Web Hosting Provider In India 2024

అందాల మలయాళ నటి కామెడీ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఐఎండీబీలో 7 రేటింగ్
అందాల మలయాళ నటి అనస్వర రాజన్ నటించిన కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.
మలయాళ సూపర్ హిట్ సినిమాలు నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖాచిత్రమ్ లాంటి వాటితో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి అనస్వర రాజన్. ఈ అందాల మలయాళ నటి నటించిన తాజా సినిమా ‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ కామెడీ మలయాళ మూవీ ఆగస్టు 14 నుంచి మనోరమా మ్యాక్స్ లో అందుబాటులో ఉంటుందని ఈ మధ్యే అనౌన్స్ చేశారు. మరి ఈ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’ ఓటీటీ
ఈ ఏడాది ఎన్నో హిట్ మలయాళం సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ఈ ‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’. ఈ మూవీ జూన్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
మనోరమ మ్యాక్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఇతర మలయాళ సినిమాల మాదిరిగానే.. ఈ ‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’ కూడా దాని ఒరిజినల్ భాషలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఏంటీ ‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’ మూవీ?
ఎస్. విపిన్ కథ రాసి, దర్శకత్వం వహించిన ‘వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్’లో అనస్వర రాజన్.. అంజలి పాత్రను పోషించింది. ఆమె నాయనమ్మ సావిత్రి అమ్మ (నటి మల్లికా సుకుమారన్) మరణం తర్వాత ఆమె కుటుంబం, సమాజం, పొరుగువారు అంత్యక్రియల కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారనే దాని చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
అంత్యక్రియల సందర్భంగా పాటించే వివిధ విధానాలపై సెటైరికల్ గా, తెలివైన సంభాషణలు, నటీనటుల కామెడీ టైమింగ్ తో ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ఐఎండీబీలోనూ 7 రేటింగ్ సాధించింది. ఈ సినిమాలో సిజు సన్నీ, జోమోన్ జ్యోతిర్, బైజు సంతోష్, అజీజ్ నెడుమంగాడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
అనస్వర రాజన్ ఇతర మూవీస్ ఇవే..
అనస్వర రాజన్ ఈ సంవత్సరం విడుదలైన మొదటి మలయాళం మూవీ ‘రేఖాచిత్రమ్‘లో నటించింది. ఇందులో ఆసిఫ్ అలీ ఒక పోలీసు పాత్రలో ప్రధాన పాత్ర పోషించాడు. జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, ఒక అస్థిపంజరం బయటపడిన తర్వాత పోలీసులు దాని వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో రేఖ అనే పాత్రలో అనస్వర నటించింది. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అనస్వర ఇతర ప్రముఖ చిత్రాలైన ‘సూపర్ శరణ్య’, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘గురువాయూర్ అంబలనడయిల్’, ‘ఉదాహరణం సుజాతా’ కూడా ఓటీటీప్లే ప్రీమియంపై అందుబాటులో ఉన్నాయి. ‘గురువాయూర్ అంబలనడయిల్’లో కూడా ఆమె సహనటులైన సిజు సన్నీ, జోమోన్ జ్యోతిర్, బైజు సంతోష్ నటించడం గమనార్హం.
సంబంధిత కథనం