



Best Web Hosting Provider In India 2024

ఏపీలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – దరఖాస్తు తేదీలివే
ఏపీలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.
ఏపీపీ రిక్రూట్ మెంట్
ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి కొత్త నోటిఫికేషన్ జారీ అయింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 11వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడుతారు.
ఏపీపీ నోటిఫికేషన్ – ముఖ్యమైన వివరాలు
- ఉద్యోగ ప్రకటన – పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్
- పోస్టులు – అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)
- మొత్తం ఖాళీలు – 42 (జోన్-I: 13, జోన్-II: 12, జోన్-III: 12, జోన్-IV: 05)
- అర్హతలు – లా డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ మెంట్ తప్పనిసరి. 04.08.2025 నాటికి రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి.
- వయోపరిమితి – 01.07.2025 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలు ఉంటాయి.
- జీతం – నెలకు రూ.57,100- రూ.1,47,760.
- దరఖాస్తు విధానం – ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం – ఆగస్టు 11
- దరఖాస్తులకు చివరి తేదీ – 07 సెప్టెంబర్ 2025.
- జోన్ల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
- ఎంపిక విధానం – రాత పరీక్ష, ఇంటర్వ్యూ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ -1 (ఆబ్జెక్టివ్) ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ పేపర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు)
- పేపర్ 1 – 200 మార్కులకు ఉండగా… పేపర్ -2 కూడా 200 మార్కులకుగానూ నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ – https://slprb.ap.gov.in/
ఈ లింక్ పైక్లిక్ చేసి ఏపీపీ పూర్తిస్థాయి నోటిఫికేషన్, సిలబస్ వివరాలను చూడొచ్చు
టాపిక్
Andhra Pradesh NewsAp GovtAp PoliceRecruitmentAp Jobs