75 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌..వంద రెట్ల కలెక్షన్లు.. ప్రొడ్యూస‌ర్‌పై ఐటీ రైడ్‌..ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ.. ఈ ఓటీటీలో!

Best Web Hosting Provider In India 2024

75 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌..వంద రెట్ల కలెక్షన్లు.. ప్రొడ్యూస‌ర్‌పై ఐటీ రైడ్‌..ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ.. ఈ ఓటీటీలో!

ఎలాంటి స్టార్లు లేరు. పెద్దగా బడ్జెట్ కూడా లేదు. కానీ కలెక్షన్లు మాత్రం కుమ్మేసింది. వంద రెట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఏడాదికి పైగా థియేటర్లలో రన్ అయింది. ఈ రొమాంటిక్ మూవీ తీసిన నిర్మాతపై ఐటీ రైడ్ కూడా జరిగింది. ఈ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.

ఇండియాలోనే అత్యంత లాభాలు పొందిన మూవీ

సినిమా సక్సెస్ కు ప్రామాణికం ఏంటీ? ఇప్పుడు అయితే కలెక్షన్లే అని అంటున్నారు. కొంతమంది ఏమో రేటింగ్ అంటున్నారు. మరి సినిమా హిట్ కు స్టాండర్డ్ ఏంటీ? థియేటర్లో ఎక్కువ కాలం రన్ కావడమా? ఇలా ఏ రకంగా చూసుకున్నా ఓ చిన్న సినిమా ప్రభంజనం మామూలు కాదు. ఈ మూవీ తన బడ్జెట్ కంటే ఏకంగా వంద రెట్ల కలెక్షన్లు రాబట్టింది. ఏడాదికి పైగా థియేటర్లలో రన్ అయింది. ఈ రొమాంటిక్ డ్రామా ఏంటో చూద్దాం.

వంద రెట్లు

ఇప్పుడు సినిమాకు పెట్టిన బడ్జెట్ ను దాటితేనే సూపర్ హిట్ అంటున్నారు. రెండు రెట్లు సాధిస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. అయిదే అయిదు రెట్లు అయితే వేరే లెవల్ అని చెబుతున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా 100 రెట్ల లాభాలు సాధించింది. ఇండియాలోనే అత్యంత లాభదాయకమైన సినిమా కథ ఇది. అదే కన్నడ రొమాంటిక్ డ్రామా ‘ముంగారు మలే’. 2006లో రచయిత, దర్శకుడు యోగరాజ్ భట్ తీసిన ఈ మూవీ రికార్డులు తిరగరాసింది.

70 లక్షలతో

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం ముంగారు మలేలో ప్రముఖ నటుడు అనంత్ నాగ్ తో పాటు అప్పటి అప్ కమింగ్ నటులు గణేష్, పూజా గాంధీ నటించారు. రూ.70 లక్షల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006 డిసెంబర్ లో విడుదలైన ముంగారు మలే సూపర్ హిట్ గా నిలిచి, చాలా చోట్ల గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుని అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. పివిఆర్ బెంగళూరులో 460 రోజులు నడిచిన ఈ చిత్రం మల్టీప్లెక్స్ లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మొదటి చిత్రంగా నిలిచింది.

కలెక్షన్లు ఇలా

ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలను దాటిన మొదటి కన్నడ చిత్రంగా ముంగారు మలే నిలిచింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ముంగారు మలే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసిందని అంచనా. అందులో రూ.57 కోట్లు కర్ణాటక నుంచి వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలైనప్పుడు గణేష్, పూజాగాంధీ ఇద్దరికీ పెద్దగా తెలియదు. కానీ దాని విజయం వారిని ఓవర్ నైట్ స్టార్స్ గా మార్చింది. ఈ ఇద్దరు నటులు తరువాతి సంవత్సరాలలో ఇతర విజయాలను ఇచ్చారు. తరువాతి అర్ధ దశాబ్దంలో కన్నడ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్లుగా మారారు.

ఐటీ రైడ్

ఈ చిత్ర విజయం నిర్మాత ఇ.కృష్ణప్పకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంగారు మలేతో రూ.67.50 కోట్లు ఆర్జించారని, దానిపై పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. అందుకోసం నిర్మాతపై కూడా దాడి చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1 వచ్చే ముందు దశాబ్దానికి పైగా ముంగారు మలే రికార్డులు పదిలంగా ఉండేవి. ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాలీ, ఒడియా, మరాఠీ భాషల్లో రీమేక్ చేశారు. 2016లో సీక్వెల్ ముంగారు మలే 2 వచ్చింది. ముంగారు మలే ఓటీటీలో అందుబాటులో ఉంది. జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024