200 కోట్ల క్లబ్ లో వార్ 2.. అయినా కష్టమే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో షాక్!

Best Web Hosting Provider In India 2024

200 కోట్ల క్లబ్ లో వార్ 2.. అయినా కష్టమే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో షాక్!

బాలీవుడ్ డెబ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ తప్పేలా లేదు. వార్ 2 కలెక్షన్లు ఏ మాత్రం పుంజుకోవడం లేదు. సండే కూడా ఈ మూవీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టమే.

వార్ 2 పోస్టర్ లో తారక్, హృతిక్

బాక్సాఫీస్ దగ్గర వార్ 2 కలెక్షన్లు జోరు అందుకోవడం లేదు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ డెబ్యూలో షాక్ తప్పేలా లేదు. ఈ సినిమా వసూళ్లు సండే కూడా పుంజుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.200 కోట్లు దాటినా.. సినిమా లాభాల్లోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సండే ఇలా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు ఆగస్టు 14న వార్ 2 థియేటర్లలో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వార్ 2 మొదటి మూడు రోజుల్లో భారతదేశంలో రూ.142.60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మూడు రోజుల్లో గ్రాస్ చూస్తే రూ.170 కోట్లుగా ఉన్నాయి. ఇందులో హిందీ, తెలుగు వెర్షన్లలో శనివారం 42% వసూళ్లు తగ్గాయి. ఆదివారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఆగస్టు 17న ఈ సినిమా రూ.31 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.

నాలుగు రోజుల్లో

వార్ 2 నాలుగు రోజుల నెట్ కలెక్షన్లు మొత్తం ఇప్పుడు రూ.173.6 కోట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ.200 కోట్లు చేరుకున్నాయి. ఓవర్సీస్ లో $5 మిలియన్లు రీచ్ అయింది. రూ.200 కోట్ల క్లబ్ లో వార్ 2 చేరింది. వరల్డ్ వైడ్ గా మూవీ కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. సండే కూడా ఈ మూవీ వసూళ్లు పెరగలేదు. ఇలా జరిగితే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

టార్గెట్ ఇదే

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వచ్చిన వార్ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.400 కోట్లు. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే వార్ 2 ఇంకా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటాల్సిందే. కానీ ప్రస్తుత ట్రెండ్ చూసుకుంటే వార్ 2 బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

డెబ్యూలో షాక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ. హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా మూవీ తెరకెక్కింది. అయాన్ ముఖర్జీ డైరెక్టర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 రిలీజైంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ పై తారక్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం వేరేలా ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024