విజయవాడ – హైదరాబాద్ హైవే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ – కి.మీ మేర వాహనాల రద్దీ..!

Best Web Hosting Provider In India 2024

విజయవాడ – హైదరాబాద్ హైవే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ – కి.మీ మేర వాహనాల రద్దీ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ నెలకొంది. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో నిన్న రాత్రి నుంచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరుస సెలవులు నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు… హైదరాబాద్ కు చేరుకోవటంతో వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది.

జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కి.మీ మేర వాహనాల రద్దీ ఉంది. భారీ స్థాయిలో వాహనాలు బారులు తీరాయి. వరస సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లిన వాళ్లు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే హైవేపై రద్దీ నెలకొంది.

నల్గొండ జిల్లా పరిధిలోని పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ పరిస్థితులు ఉన్నాయి. చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి వద్ద కొత్త నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులతో మరింత ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

దారి మళ్లింపు చర్యలు….

నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సులను మునుగోడు, సంస్థాన్ నారాయణపురం మీదుగా చౌటుప్పల్ హైవేకు మళ్లిస్తున్నారు. రద్దీ మరింత ఎక్కువ కాకుండా… అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల రూట్ల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఈ వీకెండ్ లో వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం కాగా… ఆగస్ట్ 16వ తేదీన శ్రీకృష్ణజన్మష్టామి వచ్చింది. దీనికితోడు ఆగస్ట్ 17వ తేదీన ఆదివారం కావటంతో… వరుసగా మూడు రోజులపాటు సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది గురువారం సాయంత్రం నుంచి సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. దీంతో అప్పట్నుంచే రోడ్లపై రద్దీ నెలకొంది. ఇక నిన్నటితో సెలువులు పూర్తి కాగా… సాయంత్రం నుంచి భారీగా వాహనాలు రోడ్లపైకి చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇవాళ్టి వరుక వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

HyderabadVijayawadaTelangana NewsHolidays Photos
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024