కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుతో కార్తీక్ ఛాలెంజ్.. పెళ్లి జరుగుతుందని శౌర్యకు ప్రామిస్.. జ్యో మాటలతో ఎమోషనల్

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుతో కార్తీక్ ఛాలెంజ్.. పెళ్లి జరుగుతుందని శౌర్యకు ప్రామిస్.. జ్యో మాటలతో ఎమోషనల్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో తాతతో బయటకు గెంటిస్తానని పారుతో ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. పెళ్లి జరుగుతుందని శౌర్యకు ప్రామిస్ చేసి ఎమోషనల్ అవుతాడు. మరోసారి శ్రీధర్ ఇంటికి వెళ్తాడు కార్తీక్.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో దీపే కావాలని తాళి తెంచుకుందని అన్నావా లేదా అని పారిజాతాన్ని గద్దించి అడుగుతాడు కార్తీక్. తప్పులు చేసే మనుషులు రెండు రకాలు. టైప్ 1 వీళ్లకు రెండు దెబ్బలు పడితే రెండోసారి తప్పు చేయరు. టైప్ 2 దులుపుకుపోయే రకమని కార్తీక్ అంటాడు. దెబ్బలకు భయపడదు పారు అని పారిజాతం అంటుంది.

తాతతో గెంటిస్తా

సరే ఓ ఛాలెంజ్ అని గుమ్మం బయట సర్కిల్ గీస్తాడు కార్తీక్. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు నిన్ను మెడ పట్టుకుని మా తాతతో ఈ రింగ్ లోకి గెంటించక పోతే నా పేరు కార్తీక్ కాదు అని సవాలు విసురుతాడు కార్తీక్. నువ్వు ఓడిపోతే నేను ఏం చెప్పినా వినాలి, ఏం చెప్పినా చేయాలని పారు అంటుంది. మార్నింగ్ కలుద్దామని పారుకు చెప్పి కార్తీక్, దీప వెళ్లిపోతారు. ఈ సారి కార్తీక్ కు దొరకకూడదు అని పారు అనుకుంటుంది.

శౌర్యకు ప్రామిస్

దీప పెళ్లి జరగడం ఇష్టం లేదని సుమిత్ర చెప్పిన మాటలు, పెళ్లికి రాను అనే శ్రీధర్ మాటలు గుర్తు చేసుకుంటూ కాంచన బాధపడుతుంది. పెళ్లి గురించి శౌర్య ప్రశ్నలు వేస్తుంటే కాంచన సైలెంట్ గానే ఉంటుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. పెళ్లి ఇంట్లోనా, గుడిలోనా అని కార్తీక్ ను శౌర్య అడుగుతుంది. పెళ్లి ఎక్కడో చెప్తే ఫ్రెండ్స్ ను పిలుస్తానని శౌర్య అంటుంది. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయని దీప అంటే.. కార్తీక్ తో ప్రామిస్ చేయించుకుంటుంది శౌర్య.

జ్యోత్స్న ఎంట్రీ

ఏ ధైర్యంతో నీ కూతురికి మాటిచ్చావని కార్తీక్ ను అడుగుతుంది కాంచన. నేను బాధపడినా పర్వాలేదని నా తండ్రి అనుకున్నాడు. నా కూతురు బాధ పడకూడదని నేను అనుకుంటున్నా. నిజం చెప్పి కూతురిని ఎందుకు బాధపెట్టాలి. పిల్లలను కట్టేనే తండ్రి అవరు కాపాడుకుంటేనే తండ్రి అవుతారు. ఓడిపోయిన మనిషిగా నేను ఎవరు ముందు తల దించుకుని నిలబడతానో తెలియదని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు బావ అని దీప అంటుంటే అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.

నువ్వు ఎందుకు వచ్చావో చెప్పమని జ్యోత్స్నను అందరూ అడుగుతారు. ఈ పెళ్లి బాధ్యత మాదే కదా, అన్నీ చూసుకోవాల్సింది నేనే. మా ఫ్యామిలీ పెళ్లికి రెడీగా ఉంది. మీ ఫ్యామిలీ రెడీగా ఉందో లేదో తెలుసుకుందామని వచ్చా. మగపెళ్లి వారిని పెళ్లికి సాదరంగా ఆహ్వానించాలి. శ్రీధర్ మామయ్యను పిలిస్తే చెప్పేసి వెళ్లిపోతాను. మామయ్య వస్తేనే కదా ఈ పెళ్లి జరిగేది. మామయ్యతో కలిసి అత్త వస్తేనే పెళ్లి జరుగుతుందని జ్యో అంటుంది.

పెళ్లి జరుగుతుంది

ఈ పెళ్లి జరుగుతుందని కార్తీక్ సీరియస్ గా చెప్తాడు. మీ ఇంట్లోనే మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని మీ ఇంట్లో అందరికీ చెప్పండని జ్యోతో అంటాడు కార్తీక్. ఈ పెళ్లి జరగదని తెలుసు బావ, కానీ ఓటమి ఒప్పుకోవు కదా అని జ్యో అనుకుని వెళ్లిపోతుంది. నా గెలుపు నా చేతుల్లో లేదు. అది ఎవరి చేతుల్లోనో ఉంది అని బాధ పడుకుంటూ కార్తీక్ బయటకు వెళ్లిపోతాడు. అది చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.

పారు మౌనవ్రతం

నా భర్త ఇంటికి వచ్చిన సమస్యే రాకపోయినా సమస్యే. ఇన్నాళ్లు రావద్దన్నా ఆగలేదు. ఇవాళ అవే చేతులతో మొక్కి రమ్మన్నా రావట్లేదు. నాలాంటి దాని కడుపున పుట్టినందుకు ఆ పాపం నా కొడుకు అనుభవిస్తున్నాడని కాంచన ఏడ్చేస్తుంది. మరోవైపు కార్తీక్ చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తుంది పారిజాతం. కార్తీక్ నన్ను ఇరికించే సంఘటనలు అని పేపర్ మీద రాసుకుంటుంది పారు. నోరు జారడం, దొంగతనాలు, ఇరికించడం అనే విషయాలను రాస్తుంది పారు. రూమ్ లోనే ఉండిపోతానని అనుకుంటుంది.

అప్పుడే శివన్నారాయణ డోర్ కొట్టి పిలుస్తాడు. కానీ తలుపు తీయకుండానే పారు మాట్లాడుతుంది. రేపు ఉదయం 9 గంటల వరకు మౌన వ్రతం చేస్తున్నానని పారు చెప్తుంది. శివన్నారాయణ వెళ్లిపోతాడు. ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తానని అనుకుంటుంది.

నా కథ

శ్రీధర్ దగ్గరకు రాత్రి పూట వెళ్తాడు కార్తీక్. పెళ్లికి రావాలనే మాట రాకుండా ఎంత సేపైనా మాట్లాడమని కార్తీక్ కు చెప్తాడు శ్రీధర్. శ్రీధర్ సోఫాలో కూర్చుంటే కార్తీక్ కింద కూర్చుని మాట్లాడతాడు. తండ్రీకొడుకుల్లా కాకుండా పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. అయితే పరిచయాలతో మొదలెడదామని పరిచయం చేసుకుంటారు. నా పేరు కార్తీక్. ఇది నా కథ. నేను మా అమ్మ నాన్న. నాదో అందమైన కుటుంబం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని బతికించేది ఆశ. అందరిలాగే నాకూ ఓ ఆశ ఉంది. అందుకే లండన్ నుంచి ఇండియా వచ్చా. నా కుటుంబం ఇలాగే ఉంటుందని ఆశ పడ్డా. కానీ అది ముక్కలైపోయిందని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024