విజయ్, రష్మిక చేతిలో చేయి వేసి.. న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో లవ్ బర్డ్స్ సందడి

Best Web Hosting Provider In India 2024

విజయ్, రష్మిక చేతిలో చేయి వేసి.. న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో లవ్ బర్డ్స్ సందడి

Hari Prasad S HT Telugu

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ న్యూయార్క్ లో సందడి చేశారు. అక్కడ జరిగిన ఇండియా డే పరేడ్ లో ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడిచారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్, రష్మిక చేతిలో చేయి వేసి.. న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో లవ్ బర్డ్స్ సందడి

టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వారిద్దరూ తమ మధ్య బంధాన్ని ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. ఆదివారం (ఆగస్టు 17) న్యూయార్క్ నగరంలో జరిగిన 43వ ఇండియన్ డే పరేడ్‌లో వారిద్దరూ కలిసి కనిపించారు. వారి ఫోటోలు, వీడియోలు వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. వారి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.

రష్మిక, విజయ్ చేతిలో చేయి వేసి..

కొన్ని రోజుల కిందటే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఇండిపెండెన్స్ డే వేడుకల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా పరేడ్ వీడియోలో రష్మిక, విజయ్ మాన్‌హాటన్ వీధుల్లో చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు. అయితే కెమెరాలను చూడగానే వారు వెంటనే చేతులు వదిలేసి.. వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు.

ఈ పరేడ్ లో వాళ్లు దగ్గరగా నిలబడిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఒక ఫొటోలో ఆ ఇద్దరూ ఏదో మాట్లాడుతూ కనిపించగా, మరొక ఫొటోలో ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు. విజయ్ లేత గోధుమ రంగు షేర్వాణిలో అందంగా కనిపించగా.. రష్మిక లేత గోధుమ రంగు సూట్‌, ఎర్రటి దుపట్టాతో అద్భుతంగా ఉంది. ఈ వీడియో చూసిన ఒక అభిమాని.. “వాళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లయిన వారిలా కనిపిస్తున్నారు” అని కామెంట్ చేయగా.. మరొకరు “నా #విరోష్ చాలా కాలం తర్వాత తిరిగి వచ్చారు.

ఈ వైబ్, ఈ గ్రేస్, ఈ క్యూట్‌నెస్.. ఈ రాత్రి నాకు నిద్ర పట్టేలా లేదు.. పైగా వారు చేతులు పట్టుకున్నారు” అని రాశారు. “వాళ్లిద్దరూ నిజంగా చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కూడా వారి కెమిస్ట్రీ నాకు చాలా ఇష్టం. మొదట చూడగానే నాకు వారికి పెళ్లయిందేమో అనిపించింది” అని మరో అభిమాని రాశారు.

రష్మి, విజయ్ రిలేషన్షిప్..

2018లో వచ్చిన హిట్ మూవీ ‘గీత గోవిందం’లో, ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ (2019)లో కలిసి నటించినప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. 2024లో వారిద్దరూ ప్రేమలో ఉన్నామని ఒప్పుకున్నారు. అయితే ఒకరి పేరు ఒకరు చెప్పలేదు. వారు తరచుగా కలిసి కనిపిస్తారు.

రష్మికకు విజయ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ను కూడా ఆమె వారితో కలిసి థియేటర్లలో చూశారు. ఈ మధ్యే వారిద్దరూ ఒకే కారులో ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. త్వరలో వారు తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారని కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి.

రష్మిక, విజయ్ మూవీస్

విజయ్ చివరిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘కింగ్‌డమ్’లో కనిపించాడు. ఈ సినిమాలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే కూడా కీలక పాత్రల్లో నటించారు. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.82 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.

మరోవైపు రష్మిక తన తర్వాతి మూవీ ‘థామా’లో కనిపించనుంది. ఇది మాడక్ హారర్-కామెడీ యూనివర్స్ లో భాగం. ఆదిత్య సత్పొదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ దీపావళి 2025న థియేటర్లలో విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024