





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఉరి వేసుకునేవాడు.. ఏడిపించేసిన కార్తీక్.. శ్రీధర్‌లో మార్పు..నోరు జారి నిజాలు చెప్పిన పారు
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో నా కథ అంటూ శ్రీధర్ తో పరిచయం లేని వ్యక్తిలా మాట్లాడతాడు కార్తీక్. తన ఎమోషన్ లో ఏడిపించేస్తాడు. పెళ్లికి వస్తానని శ్రీధర్ చెప్తాడు. మరోవైపు ఛాలెంజ్ లో కార్తీక్ ను ఓడించాలనే ఉద్దేశంతో నిజాలు చెప్పేస్తోంది పారు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో ఇది నా కథ అంటూ శ్రీధర్ కు చెప్తాడు కార్తీక్. కుటుంబం కోసం లండన్ నుంచి వచ్చా. కానీ అది ముక్కలైపోయింది. సరే అని జీవితంలో మళ్లీ ముందుకు వెళ్దామని అనుకునేలోపు.. అయినవాళ్లలో మాట పట్టింపులు వచ్చాయి. తల్లి, భార్య, కూతురుతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. మళ్లీ జీవితాన్ని మొదలెట్టా. నా ఆశ ఏంటీ? లక్ష్యం ఏంటీ అని ఆలోచించా. ఫ్యామిలీ సంతోషమే నా ఆశ. తల్లి, భార్య, కూతురు కోరికలు తీర్చడమే నా ఆశ అంటూ కార్తీక్ చెప్పాడు.
నాన్న బెస్ట్ ఫ్రెండ్
ఆ ఆశ తీర్చే రోజు అడుగు దూరంలో ఉంది. మీకు పరిచయం లేకపోవచ్చు. మా నాన్న పేరు కూడా శ్రీధరే. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అతను. ఆయన సిగరెట్ కాలుస్తారని, మందు తాగుతారని నాకు మాత్రమే తెలుసు. నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు ఆయన కోసం లైటర్ కొన్నా. ఇప్పటికీ నా గుర్తుగా తన దగ్గర పెట్టుకున్నాడు. నాన్న అంటే నమ్మకం, ధైర్యం, బాధ్యత, బతికినంత కాలం మర్చిపోలేని అపురూపమైన జ్ణాపకం. కానీ మా నాన్న నన్ను మోసం చేశాడు. ధైర్యాన్ని చంపేశాడని ఎమోషనల్ అయ్యాడు కార్తీక్.
తండ్రే బాధ పెడితే
కార్తీక్ ఇలా చెప్తుంటే శ్రీధర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ సోఫాలో నుంచి లేచి కింద కార్తీక్ దగ్గర కూర్చుకున్నాడు. ఎవరైనా బాధపెడితే పిల్లలు తండ్రికి చెప్తారు. తండ్రే బాధ పెడితే ఎవరికి చెప్పుకోవాలి. జన్మనిచ్చినవాడే మోసం చేస్తే ఏం చేయాలో నువ్వే చెప్పు. తల్లిన బాధ పెట్టేవాడే తండ్రి అయితే ఏం చేయాలో చెప్పు. నా తండ్రి మరొకరిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తే నా తల్లికి ఎలా ఉంటుంది? ఒక్కసారి నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించి. నీ తల్లికి నీ తండ్రి ఇలా చేస్తే క్షమిస్తావా? నాలాగే దూరం పెడతావా? అని శ్రీధర్ ను ప్రశ్నిస్తాడు కార్తీక్.
ఉరి వేసుకుని
నా తల్లి ముఖంలో సంతోషం చూసే రోజు వచ్చింది. నా పెళ్లి చాలా సమస్యలకు పరిష్కారం. అంతా బాగుందనుకునేలోపు నీ తండ్రి నీ పెళ్లికి రాను అంటే ఎలా ఉంటుంది? తండ్రి రాకపోవడం వల్ల అందరిలో తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తే నీకు ఎలా ఉంటుంది? నా లాంటి తండ్రి నీకు ఉండుంటే నా బాధ నీకు అర్థమయ్యేది. నా తల్లి ఏ పాపం చేసిందని భర్త ఉన్నా లేనట్టుగా బతకాలి. మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకోలేదు. అలా చేసి ఉంటే మా నాన్న ఉరి వేసుకుని చచ్చేవాడు అని కార్తీక్ చెప్తుంటే శ్రీధర్ ఏడ్చేస్తాడు.
పెళ్లికి వస్తా
మా అమ్మ గౌరవాన్ని కాపాడటానికైనా పెళ్లికి వస్తే బాగుండు. సారీ సార్ నా కథ అంతా మీకు చెప్పి ఇబ్బంది పెట్టా. నా స్థానంలో మీరు ఉంటే మీ తండ్రి పెళ్లికి రావాలని కోరుకుంటారా లేదా? అని కార్తీక్ అడుగుతాడు. కోరుకుంటాను అని శ్రీధర్ అంటాడు. నా తండ్రి స్థానంలో మీరు ఉంటే మీ కొడుకు పెళ్లికి మీరు వెళ్తారా వెళ్లరా? అని కార్తీక్ అడిగితే.. వెళ్తాను అని శ్రీధర్ బదులిస్తాడు. నా కొడుకు పెళ్లికి నేను వెళ్తాను. నా భార్య గౌరవాన్ని కాపాడతాను అని శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ వెళ్లిపోతాడు.
నిద్ర మాని
మరోవైపు పారిజాతం కునికిపాట్లు పడుతుంది. నిద్రను కంట్రోల్ చేసుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న నుంచి ఫోన్ వస్తుంది. నీతో మాట్లాడాలని రూమ్ కు రమ్మంటుంది జ్యో. మార్నింగ్ 9 లోపు బ్రహ్మదేవుడి వచ్చి చెప్పినా రూమ్ నుంచి బయటకు రాను. కార్తీక్ ను ఓడించాలి. ఇదే నా లక్ష్యం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పారిజాతం. పువ్వులు, కమ్మలు, గాజులు అన్నీ తీసేసి నిద్ర పోకుండా ఉండేందుకు ట్రై చేస్తుంది పారు. ఉదయం గుమ్మం బయట కార్తీక్ గీసిన సర్కిల్ దగ్గర నిలబడి ఇంకా 10 నిమిషాలే ఉందని పారు అనుకుంటుంది.
ఛాలెంజ్ అంటే ఛాలెంజ్
జుట్టు విరబోసుకుని ఉన్న పారును చూసి కార్తీక్, దీప భయపడతారు. పీ ఫర్ పారు, జే ఫర్ జాతం.. పీజే పారిజాతం అని స్టైల్ గా చెప్తుంది పారు. నీ మీద గెలవాలని రాత్రంతా తపస్సు చేశా. ఉదయం గీతలోకి తాతతో నెట్టిస్తానని ఛాలెంజ్ చేశావు కదా అని పారు అంటుంది. ఊరుకో పారు ఏదో ఆవేశంలో వంద అంటాం. ఆ మాట పట్టుకుని ఇలా చేస్తావా? అని ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్. కానీ అడ్డుకున్న పారు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని అంటుంది. ఏదో ఒకటి తేలిపోవాలని అంటుంది.
మీ నాన్న కూడా పెళ్లికి రావాలని జ్యోత్స్నతో మెలిక పెట్టించింది నేనేరా. మీ ఆవిడే కావాలని తాడు తెంపుకొని, జ్యోత్స్న తెంపిద్దన్నంటూ కలరింగ్ ఇచ్చింది కూడా నేనే. మీ నాన్నకు ఫోన్ చేసి పెళ్లికి రావొద్దని చెప్పింది కూడా నేనేరా. చూశావా రెండు మూడు చెప్పేసరికి భయపడిపోయావు అని నోరు జారుతుంది పారు. ఇంకా 10 సెకన్లు మాత్రమే ఉంది అని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్
