



Best Web Hosting Provider In India 2024

మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మనికా విశ్వకర్మ
జైపూర్‌లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటాన్ని గెలుచుకున్నారు.
రాజస్థాన్‌కు చెందిన యువతి విశ్వ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. జైపూర్‌లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న మనికా, నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో భారతదేశం తరపున పోటీ పడతారు. వరుసగా రెండో ఏడాది కూడా రాజస్థాన్‌లోనే ఈ పోటీలు జరిగాయి.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా చేతుల మీదుగా ఈ టైటిల్‌ను అందుకున్న మనికా, ఇప్పుడు ప్రపంచ వేదికపై తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. గ్లామనంద్ గ్రూప్, కే సెరా సెరా బాక్స్ ఆఫీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అందాల పోటీల గ్రాండ్ ఫైనల్ ఆగస్టు 18న రాత్రి జరిగింది.
ఎవరు ఈ మనికా విశ్వకర్మ? ఆమె విశేషాలు
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మనికా విశ్వకర్మ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. రాజకీయ శాస్త్రం (పొలిటికల్ సైన్స్), ఎకనామిక్స్‌లో చివరి సంవత్సరం చదువుతున్న ఈ యువతి గత ఏడాది ‘మిస్ యూనివర్స్ రాజస్థాన్’ టైటిల్‌ను గెలుచుకున్నారు.
మనికా బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు.. ఆమె ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్) వంటి మానసిక స్థితిని ఒక బలహీనతగా కాకుండా, ఒక ప్రత్యేకమైన ఆలోచనా శక్తిగా చూడాలని ఆమె నమ్ముతారు.
అంతేకాకుండా, మనికా BIMSTEC Sewoconలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె గొప్ప పబ్లిక్ స్పీకర్, పెర్ఫార్మర్. లలిత్ కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఆమె సత్కారాలు అందుకున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) క్యాడెట్ అయిన మనికా, అద్భుతమైన శాస్త్రీయ నృత్య కళాకారిణి, చిత్రకారిణి కూడా.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మనికా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “నేను మిస్ యూనివర్స్ రాజస్థాన్ కిరీటాన్ని నా వారసురాలికి అప్పగించిన రోజే, మిస్ యూనివర్స్ ఇండియా ఫైనల్ ఆడిషన్స్ స్టేజ్‌పై అడుగు పెట్టాను. ఒక అధ్యాయాన్ని ముగించి, అదే రోజు మరొక అధ్యాయాన్ని ప్రారంభించడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సుందరమైన కలయిక. ఎదుగుదల ఎప్పుడూ ఒక విరామం కోసం వేచి ఉండదని ఇది గుర్తు చేస్తుంది” అని ఆమె రాశారు.
ఈ పోటీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. రెండో రన్నరప్‌గా మెహక్ ధింగ్రా, మూడో రన్నరప్‌గా హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ ఎంపికయ్యారు.
టాపిక్
