




Best Web Hosting Provider In India 2024

ఇగ్నోలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు – దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే
ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులను గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్ల గడువును ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించారు. జూలై సెషన్ కింద ప్రస్తుతం ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2025 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తుల గడువు ఇటీవలే ముగియగా.. అధికారులు ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం గడువు పొడిగించలేదని స్పష్టం చేశారు.
అర్హులైన అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే నేరుగా చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సుల వివరాలు, ఫీజులు, పరీక్షల విధానం వంటి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్ …
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ignou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- స్టూడెంట్ సర్వీస్ లోకి వెళ్లి అడ్మిషన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లయ్ ఫర్ ఓడీఎల్ లింక్ ఉంటుంది.
- ఇక్కడ ఓపెన్ అయ్యే కొత్త పేజీలో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై నొక్కాలి.
- అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూర్తి చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
- వీటితో లాగిన్ అయ్యి, అడ్మిషన్ ఫామ్‌ను పూర్తిచెసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- అడ్మిషన్ ఫామ్‌ను సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీవద్ద ఉండాల్సిన పత్రాలు:
- ముందుగా ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేయాలి.
- స్కాన్ చేసిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
- స్కాన్ చేసిన సంతకం.
- అప్లోడ్ చేయడానికి అభ్యర్థి ఫొటో, సంతకం డాక్యుమెంట్ పరిమాణం 100 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఇది కాకుండా పైన పేర్కొన్న ఇతర డాక్యుమెంట్ల పరిమాణం 200 కేబీకి మించకూడదు.
- అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఇగ్నో వెబ్‌సైట్‌లో ( https://www.ignou.ac.in/pages/ ) పూర్తి సమాచారం చూడొచ్చు.
టాపిక్