శుభ్‌మ‌న్ గిల్‌కు ప్లేస్ ఉందా? ఆసియా క‌ప్‌కు టీమిండియా.. అనౌన్స్‌మెంట్ నేడే.. టైమ్‌, స్ట్రీమింగ్ వివ‌రాలు

Best Web Hosting Provider In India 2024


శుభ్‌మ‌న్ గిల్‌కు ప్లేస్ ఉందా? ఆసియా క‌ప్‌కు టీమిండియా.. అనౌన్స్‌మెంట్ నేడే.. టైమ్‌, స్ట్రీమింగ్ వివ‌రాలు

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ తిరిగి రాబోతుంది. ఆసియా కప్ 2025 సమరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కాంటినెంటల్ ట్రోఫీ కోసం ఇండియన్ టీమ్ ను ఇవాళ అనౌన్స్ చేయనున్నారు. టైమ్, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడున్నాయి.

భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (PTI)

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 పోరుకు భారత సైన్యం ఏదో నేడు తేలనుంది. 2025 ఏసీసీ పురుషుల ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును అధికారికంగా ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు (ఆగస్టు 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరగనుంది. ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ ను ప్రకటించనున్నారు.

ఎప్పుడు?

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ 2025 జరుగుతుంది. ఆ టోర్నీలో పోటీపడే భారత జట్టును మంగళవారం ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ స్టార్ట్ అవుతుంది. భారత్ లోని స్టార్ స్పోర్ట్స్ 1 నెట్ వర్క్ లో ఆసియా కప్ 2025 జట్టు ప్రకటన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

శుభ్‌మ‌న్ గిల్‌పై సస్పెన్స్

ఇటీవల ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ గా పగ్గాలు అందుకుని టీమ్ ను అద్భుతంగా నడిపించాడు శుభ్‌మ‌న్ గిల్‌. మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. కానీ అతనికి ఇండియన్ టీ20 సెటప్ లో ప్లేస్ ఉందా లేదా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. యశస్వి జైస్వాల్, అభిషేక్ వర్మ, శుభ్‌మ‌న్ గిల్‌ మధ్య ఓపెనర్ల స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. జైస్వాల్, అభిషేక్ ఇప్పటికే టీ20ల్లో తమ సత్తాచాటారు.

సూర్యకుమార్ కెప్టెన్సీలో గత టీ20 సీజన్లో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లను కన్ఫామ్ గా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

కాంబినేషన్ పై ఫోకస్

ఆసియా కప్ కోసం టీమిండియా కాంబినేషన్ పై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు టీమ్ లో కెప్టెన్ సూర్యకుమార్ ప్లేస్ మినహా ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ, శుభ్‌మ‌న్ గిల్‌, యశస్వి జైస్వాల్ పోటీలో ఉన్నారు. సంజూ శాంసన్ ను తీసుకుంటారో లేదో చూడాలి. తిలక్ వర్మకు చోటు ఖాయమేనని చెప్పొచ్చు. రింకు సింగ్, శివమ్ దూబే మధ్య పోటీ ఉంది. రెండో వికెట్ కీపర్ కోసం జితేష్ శర్మ.. ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే అక్షర్ పటేల్ ఉండే అవకాశముంది.

పేసర్లుగా బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ ను తీసుకొవచ్చు. మూడో సీమర్ గా హర్షిత్ రాణా/ అవేశ్ ఖాన్/ ప్రసిద్ధ్ కృష్ణ లో ఎవరిని సెలక్ట్ చేస్తారో చూడాలి. స్పిన్నర్ల స్థానం కోసం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ పోటీపడుతున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link