




Best Web Hosting Provider In India 2024
NEET PG result : నీట్ పీజీ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
నీట్ పీజీ 2025 ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఆ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) త్వరలోనే నీట్ పీజీ 2025 ఫలితాలను విడుదల చేయనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో చెక్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ ఫలితాలు 2025: రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?
ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ నీట్ పీజీ స్కోర్ కార్డులను ఎలా చూసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..
స్టెప్ 1- ముందుగా natboard.edu.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే NEET PG Results 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- లాగిన్ అవ్వడానికి మీ వివరాలను (క్రెడెన్షియల్స్) ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
స్టెప్ 4- తర్వాత, స్క్రీన్‌పై మీ నీట్ పీజీ ఫలితం కనిపిస్తుంది.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.
స్టెప్ 6- పరీక్ష వివరాలు & ముఖ్యమైన సూచనలు
నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్ 3, 2025న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరిగింది.
పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అభ్యర్థులు ఆ నాలుగు ఆప్షన్స్‌లో సరైన జవాబును ఎంచుకోవాలి. తప్పు సమాధానాలకు 25 శాతం నెగటివ్ మార్కింగ్ సైతం ఉంటుంది.
నీట్ పీజీ 2025లో ప్రయత్నించని ప్రశ్నలకు ఎలాంటి మార్కులు తీయరు.
త్వరలో నీట్ పీజీ 2025 ఫలితాలు- కటాఫ్ పర్సెంటైల్ ఎంత? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్బీఈఎంఎస్ హెచ్చరిక..
నీట్ పీజీ 2025 నేపథ్యంలో ఎన్బీఈఎంఎస్ అభ్యర్థులకు ఇటీవలే ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. పరీక్షకు సంబంధించిన ఏ సమాచారాన్ని, ఎలాంటి ఉద్దేశ్యంతోనూ ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది.
బోర్డు అధికారిక వాట్సాప్ ఛానెల్‌లో ఈ హెచ్చరికను జారీ చేసింది: “ఈ పరీక్షకు సంబంధించిన ఏ కంటెంట్‌ను కూడా, పాక్షికంగా లేదా పూర్తిగా, ఏ రూపంలోనైనా, మౌఖికంగా, రాతపూర్వకంగా, ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ పద్ధతుల్లో పునరుత్పత్తి చేయడం, పంపడం లేదా ప్రచురించడం వంటివి ఎన్బీఈఎంఎస్ పూర్తిగా నిషేధిస్తుంది.”
నీట్ పీజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు, పరీక్ష ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పొందుపరిచిన ఈ నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందం గురించి తెలుసుకుని, దానికి అంగీకరించినట్లు ఎన్బీఈఎంఎస్ తెలిపింది.
నీట్ పీజీ 2025 ఫలితాలపై మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link