ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం – కండక్లర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Best Web Hosting Provider In India 2024

ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం – కండక్లర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీలో ఉచిత బస్సు (స్త్రీ శక్తి) పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. సోమవారం(ఆగస్ట్ 18) ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మరోవైపు ఘాట్ రూట్లలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఘాట్ రూట్లలో కూడా అమలు – సీఎం ఆదేశాలు

స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్స్ తో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకుంటున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap Free Bus SchemeFree Bus SchemeAp GovtChandrababu NaiduApsrtc
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024