




Best Web Hosting Provider In India 2024

ఉద్ధృతంగా కృష్ణా,గోదావరి..! ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతోంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఉద్ధృతి….
మరోవైపు కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో4.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరిలో క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 36.6అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 8.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు.
ఇక శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.42, ఔట్ ఫ్లో4.04 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో3.71, ఔట్ ఫ్లో3.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
అప్రమత్తంగా ఉండండి – కలెక్టర్లకు ఆదేశాలు
కృష్ణా, గోదావరి వరద ఉధృతంగా ప్రవాహిస్తున్న నేపథ్యంలో 13 జిల్లాల కలెక్టర్లతో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలన్నారు.
లొతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. NDRF, SDRF బృందాలను జల్లాల్లో సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
సంబంధిత కథనం
టాపిక్
