హారర్, ఫ్యాంటసీ థ్రిల్లర్.. లిప్ కిస్.. అదిరిపోయేలా రష్మిక మందన్న థామా టీజర్.. హైప్ పెంచే సీన్లు.. మెరుపులా మలైకా

Best Web Hosting Provider In India 2024

హారర్, ఫ్యాంటసీ థ్రిల్లర్.. లిప్ కిస్.. అదిరిపోయేలా రష్మిక మందన్న థామా టీజర్.. హైప్ పెంచే సీన్లు.. మెరుపులా మలైకా

థామా టీజర్: ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నల బ్లడీ లవ్ స్టోరీ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది. ఈ హారర్ కామెడీ టీజర్ ఇవాళ రిలీజైంది. ఇందులో రష్మిక యాక్షన్, గ్లామర్ తో అదరగొట్టింది. లిప్ కిస్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

థామా టీజర్ లో రష్మిక, ఆయుష్మాన్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్షన్ మోడ్ లోకి దిగింది. రొమాన్స్ తోనూ కవ్విస్తోంది. లిప్ కిస్ కూడా పెట్టేసింది. ఇదంతా ఆమె అప్ కమింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘థామా’ కోసమే. ఈ బాలీవుడ్ సినిమా టీజర్ ఇవాళ (ఆగస్టు 19) రిలీజైంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ట్విస్ట్ లతో టీజర్ అదిరిపోయింది. ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఒక్క క్షణం కూడా కాదు

మాడాక్ ఫిల్మ్స్ చివరకు థామా టీజర్‌ను విడుదల చేసింది. ఒక గ్రిప్పింగ్ ‘బ్లడీ లవ్ స్టోరీ’గా ప్రచారం చేస్తున్న ఈ టీజర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచింది. థామా టీజర్ మంగళవారం విడుదలైంది ఆయుష్మాన్ ఖురానా వాయిస్‌ ఓవర్‌తో ఇది ప్రారంభమైంది.

“నువ్వు నేను లేకుండా 100 సంవత్సరాలు జీవించగలవా?” అని అడుగుతాడు హీరో. దీనికి రష్మిక మందన్న వాయిస్ “ఒక్క క్షణం కూడా కాదు” అని సమాధానం ఇస్తుంది. వాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ కనిపిస్తారు. ఆ తర్వాత ఒక భయంకరమైన విలన్ మెరుపులతో వస్తాడు. రష్మిక నొప్పి, కోపంతో అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా టోన్ మారుతుంది.

మలైకా అరోరా సాంగ్

థామాలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. టీజర్ తో అది స్పష్టమైంది. ఇందులో పరేష్ రావల్, ఫైసల్ మాలిక్, మలైకా అరోరా, నవాజుద్దీన్ సిద్ధికీ తదితరులు నటిస్తున్నారు. టీజర్ లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ ఆయుష్మాన్, రష్మిక పాత్రలు వారి ప్రేమ కోసం తీవ్రంగా పోరాడుతున్నట్లు కనిపించాయి. ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక భయంకరమైన విలన్ గా ఎంట్రీ ఇస్తాడు. మధ్యలో లిప్ కిస్ స్పెషల్ గా మారింది.

“భయం ఎప్పుడూ ఇంత శక్తివంతంగా లేదు. ప్రేమ ఎప్పుడూ ఇంత రక్తసిక్తంగా లేదు! ఈ దీపావళికి మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో మొట్టమొదటి ప్రేమకథ కోసం సిద్ధంగా ఉండండి. థామా ప్రపంచంలోకి అడుగు పెట్టండి – ఇది మునుపెన్నడూ లేని సినిమా అనుభవం – ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది” అని మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

థామా గురించి..

మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్ 2018లో హిట్ చిత్రం స్త్రీతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2022లో భేడియా, 2024లో ముంజ్య, 2024లో స్త్రీ 2 వచ్చాయి. థామా ఈ యూనివర్స్‌లో నాల్గవ భాగం. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024