



Best Web Hosting Provider In India 2024

భూమి నమోదు కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్ – ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్
రంగారెడ్డి జిల్లాల్లోని అమనగల్లు ఎమ్మార్వో ఏసీబీకి చిక్కారు. భూమి నమోదు కోసం రూ.1 లక్ష డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ కేసులో ఎమ్మార్వోతో పాటు సర్వేయర్ కూడా చిక్కాడు.
గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లులో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న చింతకింది లలిత ఏసీబీకి చిక్కారు. ఆమెతో పాటు సర్వేయర్ కోట రవి కూడా ఉన్నారు.
రూ. 1 లక్ష లంచం డిమాండ్…
అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయాన్ని సంప్రదించాడు. ఇందుకోసం అతని వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి… ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే రూ. 50 వేలు తీసుకున్న ఎమ్మార్వో… మరో రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ కోట రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్
