




Best Web Hosting Provider In India 2024

సంవత్సరంలో నలుగురిని కనడానికి లెక్కలేస్తున్న నవదీప్.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూశారా?
బిగ్ బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష ప్రోమో రిలీజైంది. ఈ షోకి జడ్జిలుగా ఉన్న నవదీప్, బిందు మాధవి, అభిజీత్ లతోపాటు హోస్ట్ శ్రీముఖి కంటెస్టెంట్లతో సరదాగా గడిపిన క్షణాలను ఇందులో చూపించారు. ఆగస్టు 22 నుంచి ఇది ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ 9 తెలుగు అసలు షోకి ముందు ఈసారి అగ్నిపరీక్ష పేరుతో మరో షోకి తెరలేపిన విషయం తెలుసు కదా. ఆగస్టు 22 నుంచి ఇది ప్రారంభం కానుండగా.. మంగళవారం (ఆగస్టు 19) ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ శ్రీముఖితోపాటు జడ్జిలు నవదీప్, బిందు మాధవి, అభిజీత్.. కంటెస్టెంట్లకు రకరకాల పరీక్షలు పెట్టడం చూడొచ్చు.
బిగ్ బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష ప్రోమో
బిగ్ బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష ప్రోమో ఆసక్తికరంగా ఉంది. నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమో సరదా సరదాగా సాగిపోయింది. దీని ద్వారా 40 మంది కంటెస్టెంట్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్ష ఎలా సాగనుందో ఈ ప్రోమో ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.
దీనికి జడ్జిలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఇక షోని శ్రీముఖి హోస్ట్ చేస్తోంది. ఈ ప్రోమోలో ఓ లేడీ కంటెస్టెంట్ కు ఐస్ వాటర్ లో ముఖం పెట్టే చాలెంజ్ ను విసిరారు. ఆ కంటెస్టెంట్ తో నవదీప్ పెళ్లి సంబంధం మాట్లాడానికి వచ్చానంటూ స్టేజ్ పైకి వస్తాడు.
ఐస్ వాటర్ లో ఆమె తన తల ముంచడానికి ముందు బాగున్నారంటూ నవదీప్ కు కాంప్లిమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీముఖి గురించి చెబుతూ మా అత్తగారు బాగున్నారని అంటుంది. వాళ్లిద్దరి చేతులను కలుపుతూ ఏడాదిలోగా నాకు నలుగురు మనవళ్లు కావాలని శ్రీముఖి అనడంతో ఏడాదిలో నలుగురిని ఎలా కనాలా అంటూ నవదీప్ లెక్కలేసుకోవడం ప్రోమోలో చూడొచ్చు.
బిందు మాధవి ఫ్లర్టింగ్
ఇక ఆ తర్వాత ప్రోమోలో బిందు మాధవి మరో మేల్ కంటెస్టెంట్ ను ఫ్లర్ట్ చేయడం కూడా కనిపిస్తుంది. చాలా ఫిట్ గా ఉన్నారని అనడంతో అతడు షర్ట్ విప్పి తన సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. ఆ తర్వాత బిందు మాధవి ముందుకెళ్లి షో చేస్తాడు. అతన్ని చూసి ఆమె ఫుల్ ఎగ్జైట్ అయిపోతుండగా.. ఏంటి మరి గ్రీన్ ఇచ్చేద్దామా.. ఇంకా కనుక్కుందామా ఏమైనా అని పక్కనే ఉన్న నవదీప్ అంటాడు. అక్కడితో ఈ ప్రోమో ముగుస్తుంది.
ఈసారి బిగ్ బాస్ తెలుగులో ప్రముఖులతోపాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్న విషయం తెలిసిందే. అందుకోసమే ఈ అగ్నిపరీక్ష పేరుతో ఇప్పటికే వచ్చిన ఎంట్రీల నుంచి 40 మందిని ఎంపిక చేసి వాళ్లకు ఈ పరీక్ష పెడుతున్నారు. వీళ్లలో నుంచి ముగ్గురు మాత్రమే హౌస్ లోకి వెళ్తారు. అసలు బిగ్ బాస్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతుండగా.. ఈ అగ్నిపరీక్ష ఆగస్టు 22న మొదలవుతుంది. జియోహాట్‌స్టార్ లో దీనిని చూడొచ్చు.
సంబంధిత కథనం
