తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా హీరో సుహాస్.. మండాడి నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. బర్త్ డే కానుకతో విషెస్

Best Web Hosting Provider In India 2024

తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా హీరో సుహాస్.. మండాడి నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. బర్త్ డే కానుకతో విషెస్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ వర్సటైల్ హీరో సుహాస్ విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నాడు. సుహాస్ విలన్‌గా చేస్తున్న తమిళ సినిమా మండాడి. హై యాక్టెన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మండాడి నుంచి సుహాస్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుహాస్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేశారు.

తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా హీరో సుహాస్.. మండాడి నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. బర్త్ డే కానుకతో విషెస్

టాలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ఆకట్టుకునే హీరో సహాస్. ఇప్పుడు తమిళంలో మొదటిసారిగా హీరో సుహాస్ విలన్‌గా చేస్తున్న సినిమా మండాడి. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే.

అద్భుతమైన పాత్రలను

‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న మండాడి సినిమాలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన సన్నివేశాలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ‘మండాడి’ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

కెరీర్‌లో మొదటిసారిగా

యంగ్ హీరో సుహాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఇవాళ (ఆగస్టు 19) సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’ మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే.

సుహాస్ బర్త్ డే సందర్భంగా

ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన సుహాస్ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

మనుగడ, వ్యక్తిగత గుర్తింపు

వీరితోపాటు మండాడి సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం

తెలుగు, తమిళంలో తెరకెక్కుతోన్న మండాడి సినిమాకు మరో హీరో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు.

రిలీజ్ డేట్

ఎడిటింగ్ ప్రదీప్ ఇ. రాఘవ్, ప్రొడక్షన్ డిజైన్ డి.ఆర్.కె. కిరణ్, వి.ఎఫ్.ఎక్స్ ఆర్. హరిహర సుతాన్ నిర్వహిస్తున్నారు. త్వరలో మండాడి సినిమా విడుదల తేదిని నిర్మాతలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, సుహాస్ తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు.

మరో సినిమాతో

హే భగవాన్ అనే కొత్త సినిమాతో కూడా సుహాస్ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన హే భగవాన్ గ్లింప్స్ వీడియో సైతం బాగా ఆకట్టుకుంటోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024