



Best Web Hosting Provider In India 2024

ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు 2025 : రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు – కొత్త తేదీలివే
ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రిజిస్ట్రేషన్ల గడువు ఆగస్ట్ 26వ తేదీతో పూర్తి అయిన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 1 వరకు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రిజిస్ట్రేషన్ల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఈ గడువు ఆగస్ట్ 26వ తేదీతో పూర్తి కాగా… ఈ సమయాన్ని సెప్టెంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ఈలోపు అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
డిగ్రీ కోర్సుల్లో చేరుందుకు ఆసక్తి గల విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 ఫీజును కట్టాలి. ఆన్ లైన్ ద్వారానే ఈ ఫీజును చెల్లించాలి. వెబ్ ఆప్షన్ల గడువును కూడా సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు.
ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు – ముఖ్యమైన వివరాలు
- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
- ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- సెప్టెంబర్ 1 తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఫీజు – ఓసీలు రూ.400, బీసీలు రూ.300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 కట్టాలి.
- స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహిస్తారు.
- సెప్టెంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కాలేజీలను ఎంచుకోవాలి.
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ – 3 సెప్టెంబర్ 2025.
- సెప్టెంబర్ 6 న సీట్ల కేటాయింపు ఉంటుంది.
- రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియను పూర్తి చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్