




Best Web Hosting Provider In India 2024

అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత – సీఎస్
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలని సీఎస్ స్పష్టం చేశారు. అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందించాలని సీఎస్ కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టర్లదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తప్పనిసరిగా పెన్షన్ అందాలి – సీఎస్
పలు అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్… జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా పింఛన్లు పంపిణీపై సీఎస్ మాట్లాడుతూ…. అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడలాని… అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా,సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని సీఎస్ సూచించారు.
టాపిక్