నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్: 66 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా ఉండటానికి సీక్రెట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్: 66 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా ఉండటానికి సీక్రెట్ ఇదే

HT Telugu Desk HT Telugu

Happy birthday Nagarjuna: అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు 60 దాటినా, ఇప్పటికీ 30 ఏళ్ల యువకుడిలా కనిపించే నాగార్జున ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. తన ఫిట్‌నెస్ రహస్యాలను ఇక్కడ తెలుసుకోండి.

బర్త్ డే బాయ్ నాగార్జున

‘మ్యాన్ విత్ ద గోల్డెన్ హార్ట్’గా అభిమానులు పిలుచుకునే అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు 60 దాటినా, ఇప్పటికీ 30 ఏళ్ల యువకుడిలా కనిపించే నాగార్జున ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. తన ఫిట్‌నెస్ రహస్యాలను ఆయన గతంలో హిందూస్థాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను గత 30-35 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నానని నాగార్జున తెలిపారు.

నాగార్జున వర్కవుట్ రొటీన్ ఇదే

నాగార్జున వర్కవుట్ రొటీన్‌లో కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ ఉంటాయట. వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కవుట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారట. ఉదయం 45 నిమిషాల నుంచి గంటపాటు చాలా ఇంటెన్స్‌గా వర్కవుట్ చేస్తానని చెప్పారు.

“నేను కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ చేస్తాను. గత 30-35 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాను. స్థిరత్వం చాలా ముఖ్యం. నేను రోజంతా చురుకుగా ఉంటాను. ఒకవేళ జిమ్‌కు వెళ్లలేకపోతే, నడకకు లేదా ఈతకు వెళ్తాను. వర్కవుట్ చేయకుండా ఉండటం కంటే పని చేయకుండా ఉండటమే మంచిది. ఉదయం లేవగానే నా మొదటి ప్రాధాన్యత వర్కవుట్‌కే. వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు తప్పకుండా వర్కవుట్ చేస్తాను. దాదాపు 45 నిమిషాల నుంచి గంటసేపు వర్కవుట్ చేస్తాను. కానీ అది చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది.. మామూలుగా కాదు” అని నాగార్జున అన్నారు.

వర్కవుట్ చేస్తున్నప్పుడు ఈ టిప్స్ పాటించండి

పని మధ్యలో నాగార్జున తనకు తన ట్రైనర్ చెప్పిన ఓ ట్రిక్‌ను కూడా పంచుకున్నారు. వ్యాయామం చేస్తున్నప్పుడు హార్ట్‌బీట్ రేటును గరిష్ఠంగా 70% కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. దానివల్ల మన జీవక్రియలు రోజంతా చురుకుగా ఉంటాయని అన్నారు.

“కొన్నాళ్ల క్రితం నా ట్రైనర్ నాకు ఒక ట్రిక్ నేర్పించారు. అది కార్డియో అయినా, స్ట్రెంత్ ట్రైనింగ్ అయినా.. వర్కవుట్ చేస్తున్నప్పుడు మీ హార్ట్‌బీట్ రేటు మీ గరిష్ఠ రేటులో 70% కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే, మధ్యలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవద్దు, కూర్చోవద్దు, ఫోన్లు వాడొద్దు. పూర్తిగా వ్యాయామంపైనే దృష్టి పెట్టండి. అప్పుడే మీ జీవక్రియలు రోజంతా చురుకుగా ఉంటాయి. ఫిట్‌నెస్‌కు నేను నమ్మే మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి రోజూ ఒక గంట లేదా 45 నిమిషాలు కేటాయించండి. అది సరిపోతుంది. అలాగే, సరిపడా నిద్రపోవడం, నీళ్లు తాగడం కూడా మర్చిపోవద్దు” అని నాగార్జున అన్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024