





Best Web Hosting Provider In India 2024

బీర్ ఓ ఎమోషన్.. తప్పతాగి జాబ్ కోల్పోయిన తమన్నా.. సొంతంగా బీర్ బిజినెస్‌లోకి.. అదిరిపోయిన కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్
తమన్నా భాటియా కొత్త వెబ్ సిరీస్ డూ యూ వానా పార్ట్‌నర్ ట్రైలర్ శుక్రవారం (ఆగస్టు 29) రిలీజైంది. తప్పతాగి జాబ్ కోల్పోయి.. సొంతంగా బీరు తయారీ బిజినెస్ లోకి దిగే అమ్మాయి పాత్రలో తమన్నా ఇందులో నటించింది.
బీర్ కేవలం మందు కాదు అదో ఎమోషన్ అంటోంది తమన్నా భాటియా. ఆమె నటించిన డూ యూ వానా పార్ట్‌నర్ (Do You Wanna Partner) వెబ్ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఆగస్టు 29) రిలీజైంది. ఇందులో తప్పతాగి జాబ్ కోల్పోయే ఆమె.. తన పార్ట్‌నర్ తో కలిసి సొంతంగా బీరు తయారీ బిజినెస్‌లోకి దిగడం చూడొచ్చు. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
డూ యూ వానా పార్ట్‌నర్ ట్రైలర్
డూ యూ వానా పార్ట్‌నర్ వెబ్ సిరీస్ లో తమన్నా భాటియా, డయానా పెంటీ నటిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 29) ప్రైమ్ వీడియో ఇండియా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు నటీమణులు ఫ్రెండ్స్ నుండి బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారి ఒక బీర్ బ్రాండ్ ను సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఈ ట్రైలర్ లో చూపించారు.
ట్రైలర్ మొదట్లోనే బీర్ కేవలం మందు కాదు ఓ ఎమోషన్ అని తమన్నా అంటుంది. రాత్రంతా తప్పతాగి ఉదయాన్నే ఆఫీసుకు ఆలస్యంగా వెళ్తుంది. తన జాబ్ పోయినట్లే అని బాధపడుతుంది. తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి బిజినెస్ చేయాలని అనుకొని బీర్ తయారీ బిజినెస్ లోకి దిగుతుంది. అది అంత ఈజీ కాదని వాళ్లకు తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సిరీస్ స్టోరీ.
ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇలా..
తమన్నా నటిస్తున్న డూ యూ వానా పార్ట్‌నర్ వెబ్ సిరీస్ ట్రైలర్‌పై ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ఒక అభిమాని స్పందిస్తూ.. “తమన్నాను కొత్త సిరీస్‌లో చూస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది” అని కామెంట్ చేశారు. “తమన్నా ఇంకా డయానా వాళ్ళ గర్ల్‌బాస్ ఎరాలో ఉన్నారు. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంది. కాస్ట్ కూడా చాలా బాగుంది” అని ఇంకొక ఫ్యాన్ అన్నారు.
ఈ వెబ్ సిరీస్ లో జావేద్ జాఫేరి, నకుల్ మెహతా, నీరజ్ కాబీ, శ్వేతా తివారీ, సూఫీ మోటివాలా, రణ్‌విజయ్ సింగ్, ఇంకా లోకేష్ మిట్టల్ కూడా నటించారు. మిథున్ గంగోపాధ్యాయ, నిశాంత్ నాయక్ దీనిని క్రియేట్ చేశారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ దీన్ని ప్రెజెంట్ చేస్తోంది. ఇది సెప్టెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది.
సంబంధిత కథనం