గోదావరి టెంపుల్ టూర్ : హైదరాబాద్ నుంచి సరికొత్త ప్యాకేజీ – ఈ ఆలయాలన్నీ చూడొచ్చు

Best Web Hosting Provider In India 2024

గోదావరి టెంపుల్ టూర్ : హైదరాబాద్ నుంచి సరికొత్త ప్యాకేజీ – ఈ ఆలయాలన్నీ చూడొచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. సెప్టెంబర్ 5వ తేదీన జర్నీ ఉంటుంది. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

అన్నవరం టెంపుల్

ఐఆర్సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి గోదావరి టెంపుల్ టూర్ పేరుతో కొత్త ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు.

గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ – ముఖ్య వివరాలు

  • ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ 5 సెప్టెంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
  • ఇందుకు సంబంధించి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/) లో చూడాలి.
  • లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి అయితే 9.15 గంటలకు గౌతమి ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెంబర్ 12738) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఉదయం 4,38 గంటలకు రాజమండ్రి స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కి వెళ్తారు. ఆ తర్వాత అన్నవరం దర్శనం పూర్తవుతుంది. గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ చూస్తారు. రాత్రి రాజమండ్రిలోనే ఉంటారు.
  • మూడో రోజు అంతర్వేదికి వెళ్తారు. నర్సింహ్మా స్వామి దర్శనం ఉంటుంది. బీచ్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి బాలాజీ టెంపుల్, అప్పన్నపల్లి, విఘ్నేశ్వరం టెంపుల్, ఐనవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షరామం వెళ్తారు. రాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది.
  • ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, 5.55 నిమిషాలకు లింగంపల్లికి చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
  • గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరల వివరాలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 15,340, డబుల్ షేరింగ్ కు రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7170గా ఉంది. ఈ ధరలన్నీ కంఫర్ట్ క్లాస్ లో ఉంటాయి.
  • స్టాండర్డ్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ, 5630, డబుల్ షేరింగ్ కు రూ. 7400, సింగిల్ షేరింగ్ కు రూ. 7400గా ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

IrctcIrctc PackagesTravelHyderabadEast Godavari
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024