జాన్వీ కపూర్ ఇతన్ని పెళ్లి చేసుకుందా? ఆమె ఎందుకు అలా అబద్ధం చెప్పిందో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

జాన్వీ కపూర్ ఇతన్ని పెళ్లి చేసుకుందా? ఆమె ఎందుకు అలా అబద్ధం చెప్పిందో తెలుసా?

Hari Prasad S HT Telugu

జాన్వీ కపూర్ తాను పెళ్లి చేసుకున్నానని ఒకసారి కాదు చాలాసార్లే అబద్ధం చెప్పిందట. ఓసారి తన బెస్ట్ ఫ్రెండ్ ను కూడా అలాగే పరిచయం చేసిందట. దీనికి కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వెల్లడించింది.

జాన్వీ కపూర్ ఇతన్ని పెళ్లి చేసుకుందా? ఆమె ఎందుకు అలా అబద్ధం చెప్పిందో తెలుసా?

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రీసెంట్ గా ఒక తెలియని విషయం చెప్పింది. ఆమెకు తరచుగా బయట.. ముఖ్యంగా ఇండియాలో లేనప్పుడు కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతుంటాయని వెల్లడించింది. అలాంటి వాటిని తప్పించుకోవడానికి తనకు పెళ్లయినట్లుగా ఆమె చెబుతుందట. ఒకసారి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓర్హాన్ అవత్రామణి అలియాస్ ఓర్రీని తన భర్తగా పరిచయం చేశానని కూడా చెప్పడం విశేషం.

జాన్వీ కపూర్ ఏం చెప్పిందంటే?

జాన్వీ కపూర్ ఐఎండీబీ ఒరిజినల్ సిరీస్ అయిన ‘స్పీడ్ డేటింగ్’లో తన ‘పరమ్ సుందరి‘ కోస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పాల్గొంది. ఇందులో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. ప్రేమ, ఫస్ట్ డేట్స్ పై తన అభిప్రాయాలను పంచుకుంది. విదేశాల్లో ఫ్లర్టింగ్ ను తప్పించుకోవడానికి తాను ఒకసారి ఓర్రీని తన భర్తగా చెప్పుకోవాల్సి వచ్చిందని కూడా జాన్వీ వెల్లడించింది.

“నేను చాలాసార్లు పెళ్లయింది అని చెప్పాను. నన్ను నేరుగా వచ్చి అడిగింది ఎక్కువగా ఇండియా బయటే. లాస్ ఏంజెల్స్ లో చాలా మంది వెయిటర్లు నాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేవారు. లేదా నేను ఆర్డర్ చేయనివి తీసుకొచ్చేవారు. ఒకసారి నేను ఓర్రీతో ఉన్నప్పుడు అతన్ని నా భర్తగా పరిచయం చేశాను” అని జాన్వీ చెప్పింది.

ఫస్ట్ డేట్‌పై ఏమన్నదంటే?

ప్రస్తుతం శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్న జాన్వీ.. ఫస్ట్ డేట్‌కి తన డీల్‌బ్రేకర్ ఏంటో కూడా తెలిపింది. “ఫస్ట్ డేట్ చాలా ముఖ్యమైనది. వాళ్ళు లేట్‌గా రాకూడదు. నిజానికి తొందరగా రావాలి. వాళ్ళు కాస్త నెర్వస్‌గా కనిపించాలి. నా దృష్టిలో మెటీరియలిస్టిక్ వస్తువుల కంటే ఎమోషనల్ విషయాలు చాలా ముఖ్యం” అని జాన్వీ చెప్పింది.

తనను ఇంప్రెస్ చేయడానికి ఒక పార్ట్‌నర్ చేసిన అత్యంత రొమాంటిక్ పని గురించి అడిగినప్పుడు.. జాన్వీ ఇలా చెప్పింది. “నేను ఒకసారి చాలా చెడ్డ కల కన్నాను. దానితో భయపడిపోయాను. అప్పుడు అతను లండన్ నుండి ముంబైకి ఐదు గంటల కోసం మాత్రమే నన్ను కలవడానికి చాలా లాంగ్ ట్రిప్ చేశారు” అని జాన్వీ చెప్పడం విశేషం.

జాన్వీ లేటెస్ట్ ప్రాజెక్ట్

జాన్వీ కపూర్ ఈ మధ్యే ‘పరమ్ సుందరి’ సినిమాలో కనిపించింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ఢిల్లీ నుండి వచ్చిన ఒక పంజాబీ అబ్బాయి, కేరళ నుండి వచ్చిన హాఫ్ తమిళియన్-హాఫ్ మలయాళీ అమ్మాయి లవ్ స్టోరీ చూపించారు. తుషార్ జలోటా డైరెక్ట్ చేసిన ఈ రోమ్ కామ్‌ను దినేష్ విజన్ మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించారు.

ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీని తర్వాత ఆమె వరుణ్ ధావన్, సాన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్‌లతో కలిసి ‘సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి’ సినిమాలో కనిపించనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024