





Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ఆగస్ట్ 30 ఎపిసోడ్: రాజ్‌కు రామ్ గురించి చెప్పిన అపర్ణ- యామినికి బుద్ధి చెప్పిన తండ్రి రఘునందన్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 30 ఎపిసోడ్‌లో రాజ్‌కు గతంలో జరిగింది గుర్తు లేదని, యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే స్పృహలోకి వచ్చినట్లు ఉంటాడని డాక్టర్ చెబుతాడు. మరోవైపు యామిని ఇప్పటికీ రాజ్ కావాలని అంటే తండ్రి రఘునందన్ బుద్ధి చెబుతాడు. మరోవైపు రాజ్‌కు రామ్ గతం గురించి చెబుతుంది అపర్ణ.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌కు గతం గుర్తుకు రావడంతో యామిని పిచ్చిదానిలా చేస్తుంది. రాజ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో తల్లిదండ్రులకు చెబుతుంది. కావ్యను వదలను, దాని అంతు చూసి రాజ్‌ను సొంతం చేసుకునే వరకు ఊరుకోను అని యామిని అంటుంది.
పిచ్చి పనులు చేసిన ఊరుకున్నాం
నోర్మూయ్. ఇంత జరిగాక నీకు బుద్ధి రాలేదా. ఇకనైనా మా మాట విను. నీకోసం ఎన్ని పిచ్చి పనులు చేసిన ఊరుకున్నాం. ఇన్నాళ్లు ఓ నమ్మకం ఉండేది. కానీ, ఈరోజుతో అర్థమైంది. రాజ్ కావ్య సొంతమే. ఇకనైనా పిచ్చి ప్రయత్నాలు ఆపు. కొత్త జీవితం ప్రారంభించు అని యామిని తండ్రి రఘునందన్ సలహా ఇస్తాడు.
నేను వినను. కొత్త జీవితం ప్రారంభించను. రాజ్ లేని జీవితం నాకు వద్దు. కావాలంటే చచ్చిపోతాను. నాకు రాజ్ కావాలి రాజ్ కావాలి అని పిచ్చిదానిలా అరుస్తుంది యామిని. నువ్ అడిగింది మనిషి ప్రేమ. దాన్ని ఎంత ఖర్చు పెట్టి కొనలేం. మమ్మల్ని బాధపెట్టి నువ్ సంతోషంగా ఉండాలనుకుంటే నీ ఇష్టం అని రఘునందన్ వెళ్లిపోతాడు.
మరోవైపు రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని, శ్రీశైలం యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే స్పృహలోకి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మధ్యలో జరిగిన విషయాలు ఏవి గుర్తు లేవు అని డాక్టర్ చెబుతాడు. డబ్బులు గుంజడానికి కట్టు కథలు చెబుతున్నారా. మధ్యలో విషయాలు గుర్తు లేవంటే ఎలా అని రుద్రాణి అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడతాడు. సుభాష్ రుద్రాణిని వారిస్తాడు.
గతం మర్చిపోయిన విషయం
ఇకనుంచి రాజ్ మీ అబ్బాయిలానే మీతో ఉంటాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత గతం మర్చిపోయిన విషయం మాత్రం గుర్తుండదు. అంతకుమించి ఏ సమస్య లేదు. ఈరోజే డిశ్చార్జ్ చేస్తాం. తీసుకెళ్లొచ్చు. కానీ, తను స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త పడండి అని డాక్టర్ చెబుతాడు. మంచి న్యూస్ చెప్పారు అని ఇందిరాదేవి అంటుంది. కావ్య నీ పూజలు ఫలించాయి. వెళ్లి మాట్లాడు అని చెబుతుంది ఇందిరాదేవి.
రాజ్ చేయిని కావ్య పట్టుకునేసరికి రాజ్ స్పృహలోకి వస్తాడు. ఎక్కడికి వెళ్లిపోయావు. నేను కళ్లు తెరవగానే నా కళ్లముందు ఉండాలిగా. నీకు ఏమైందో అని కంగారుపడ్డాను. చావు అంచుల్లో ఉన్నప్పుడు నేను కోరుకుంది ఒక్కటే. ఈ ప్రమాదంలో ఏమైనా జరిగితే నాకే జరగాలని. నువ్ క్షేమంగా ఉండాలని అని రాజ్ అంటాడు. ఇక మీ చేతిని జీవితంలో వదలను అని కావ్య అంటుంది.
మరోవైపు ఇంట్లో సీతారామయ్య హడావిడి చేస్తాడు. స్వప్నతో రాజ్‌కు హారతి ఇప్పిస్తాడు. రాజ్ అందరికి పంచ్‌లు వేస్తుంటాడు. అంతా సంతోషంగా ఉంటారు. కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అది చూసిన రాజ్ తనకు ఏమైంది అని అడుగుతాడు. ఇన్నాళ్లుగా తను ఎంతో నరకం అనుభవించిందో తెలుసా అని ఇందిరాదేవి అంటుంది.
నరకం చాలా చిన్న మాట
నరకం చాలా చిన్న మాట. కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఎలా ఉంటుంది అని ధాన్యలక్ష్మీ నోరు జారుతుంది. నేను అనుమానించడం ఏంటీ అని షాక్ అయిన రాజ్ అందరిని అడుగుతాడు. అందరూ ఏం లేదని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ, రాజ్ వినడు. నిజం చెప్పమని అంటాడు. నువ్ భరించలేని బాధను ఇచ్చావ్. జరిగింది చెబుతా. కానీ, ప్రశాంతంగా విను. అలాగే, జరిగింది తలుచుకొని బాధపడనని మాటివ్వు అని అపర్ణ అంటుంది.
రాజ్ గతం మర్చిపోవడం, యామిని ఇంట్లో రామ్‌గా ఉండటం, కావ్యను ప్రేమించడం, కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం, రామ్‌గా ఉన్నప్పుడు నువ్ అనుమానించడం, నిందించడం అన్ని విషయాలు చెబుతుంది అపర్ణ. తన మానమా, నీ ప్రాణమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు నీ ప్రాణం కోసమే మౌనంగా ఉంది అని సుభాష్ చెబుతాడు. ఇలాంటి భార్య దక్కాలంటే ఎన్ని జన్మలెత్తాలిరా నువ్వు అని అపర్ణ అంటుంది.
ఈరోజు నీకు గతం గుర్తుకు వచ్చి నువ్ రాగానే తన బాధనంతా కన్నీళ్లతో తుడుచుపెట్టుకుంటుంది. ఇప్పుడైన తనను ఓదార్చురా అని అపర్ణ చెబుతుంది. దాంతో కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. ఈ క్షణంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని రాజ్ అంటాడు.
రాజ్‌ను హత్తుకున్న కావ్య
పెళ్లి చేసుకున్నప్పుడు తాను ప్రవర్తించినదంతా చెబుతాడు రాజ్. దాంతో కావ్య వెళ్లి రాజ్‌ను హత్తుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్