కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్- మనవరాలికి షాక్ ఇచ్చిన పారిజాతం- తల్లిని మెచ్చుకున్న దాసు

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్- మనవరాలికి షాక్ ఇచ్చిన పారిజాతం- తల్లిని మెచ్చుకున్న దాసు

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 30 ఎపిసోడ్‌లో సత్య నారాయణ వ్రతానికి శివ నారాయణ, దశరథ్ వస్తారు. సుమిత్ర రావట్లేదని చెబుతారు. దాంతో కాంచన బాధపడుతుంది. అది అవకాశంగా చేసుకుని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. తల్లి పారిజాతం చేస్తున్న పనని మెచ్చుకుంటాడు దాసు. శ్రీధర్‌కు అవమానం జరుగుతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి దాసు, శ్రీధర్ వస్తారు. దీప మెడలో తాళి చూస్తూ జ్యోత్స్న రగిలిపోతుంది. అది చూసిన దీప ఏంటీ అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. చిన్నప్పుడు అదృష్టం గురించి విన్నాను. నిన్ను చూస్తుంటే తెలుస్తోంది అని జ్యోత్స్న అంటుంది.

నువ్వే అదృష్టవంతురాలివి

నాకంటే అదృష్టవంతురాలివి నువ్వు. నీ దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే వారి విలువ నీకు తెలియదు అని దీప అంటుంది. నేను అదృష్టవంతురాలిని కాబట్టే దాసు కూతురులా పెరిగే నేను దశరథ్ కూతురిలా పెరిగా. నువ్వు కుబేరా కూతురిలా పెరిగావ్. ఈ తాళి కూడా నీ మెడలో ఎక్కువ కాలం ఉండదు. నీది అనేది నాకు దక్కాలని విధి ఎప్పుడు రాసి పెట్టి ఉంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

పారు హడావిడి చేస్తే కార్తీక్ డౌట్ పడతాడు. ఇంతలో శివ నారాయణ వాళ్లు వస్తారు. దాసును పలకరించిన శివ నారాయణ పెళ్లికి ఎందుకు రాలేదని అడుగుతాడు. దాసు జ్యోత్స్నను చూస్తాడు. అది చూసిన కార్తీక్ మావయ్య పెళ్లికి రాకుండా ఉండటానికి జ్యోత్స్న కారణమై ఉంటుందా అని డౌట్ పడతాడు. చిన్న పని ఉండి వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది అని అబద్ధం చెబుతాడు దాసు.

వదిన రాలేదేంటీ అని కాంచన అడిగితే.. రావట్లేదు అని దశరథ్ చెబుతాడు. రాలేదంటే ఎలా కుదురుతుంది. నేను మీ మాట గౌరవించాను. సుమిత్ర కూడా గౌరవించాలి కదా. ఇప్పుడు అందరూ బాధపడతారు. జంటను దీవించడానికి దీప తల్లిదండ్రులు ఇద్దరు లేరే అని పారిజాతం అంటుంది. పారిజాతం మాటలను జ్యో ఆపుతుంది. వచ్చిన వారికి మర్యాదలు చేయండి అని కార్తీక్ అంటాడు.

యజమానులుగా రాలేదు

మేము యజమానులుగా రాలేదు, తాత అని పిలవచ్చు అని శివ నారాయణ అంటాడు. శివ నారాయణ వాళ్లు కూర్చొంటారు. వాళ్లు పలకరిస్తే తప్పా మాట్లాడను అని అనుకుంటాడు శ్రీధర్‌. దా నా పక్కన కూర్చో అని శివ నారాయణ అంటే.. తననే పిలిచాడనుకుని శ్రీధర్ పోజు కొడుతు వెళ్తాడు. రా దాసు నిన్నే అని శివ నారాయణ అనేసరికి అవమానంగా ఫీల్ అవుతాడు శ్రీధర్.

పారిజాతం తెగ సంతోషంగా ఫీల్ అవుతుంది. దాసు భుజంపై చేయి వేసి పని ఉంటే మళ్లీ చూసుకోవచ్చు అని కూర్చోమంటాడు శివ నారాయణ. ఇంతకన్న అవమానం ఉండదు అని శ్రీధర్ అనుకుంటాడు. అదంతా కావేరి, అనసూయ, పారిజాతం చూస్తారు. వాళ్లను చూసి మరింత అవమానపడతాడు శ్రీధర్. పారిజాతం వెళ్లి మరింత ఏడిపిస్తుంది.

అమ్మ మనసులో దీపపై ఎలాంటి కోపం ఉందో అత్తగారికి మరోసారి చూపిస్తాను అని జ్యోత్స్న అనుకుంటుంది. కాంచన దగ్గరికి వెళ్లి జ్యోత్స్న వెళ్తుంది. మా అమ్మ ఈ వ్రతానికి రాలేదన్న బాధ నీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఓ పని చేయు. మా మమ్మీకి కాల్ చేసి రమ్మను. ఒకసారి ట్రై చేయు నాకోసం కాదు నీ కోడలి కోసం అని ఫోన్ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

నీకోసం ఎదురుచూస్తున్నా

సుమిత్రకు కాంచన వాయిస్ మెసేజ్ పెడుతుంది. సుమిత్ర పెళ్లి చూపులప్పుడు కాంచన అనుకుంది చెబుతుంది. నువ్ మాకు వదిన కావాలని మా నాన్నకు మొదట చెప్పింది నేనే. పిల్లల గురించి తప్పా మనకు ఏ వైరాలు ఉన్నాయి. కనీసం నీ చేతిలో పెరిగిన కార్తీక్ కోసమైనా నీ ఆడపడుచు ఇంటికి రాలేవా. అందరు ఉన్న నీకోసం ఎదురుచూస్తున్నాను. ఒక్కసారి అయినా ఆలోచించవా అని కాంచన అంటుంది.

దాంతో సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతుంది. మీ మావయ్యతో మాట్లాడమని శ్రీధర్‌కు కావేరి చెబుతుంది. దాంతో శివ నారాయణ దగ్గరికి వెళ్లి ఏదోటి మాట్లాడి వెళ్లిపోతాడు. పాత గొడవలతో పంచాయితీ పెట్టుకోవాలని లేదు అని శివ నారాయణ అంటే ఏదో రోజు అందరూ నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని శ్రీధర్ వెళ్లిపోతాడు. వీడు మారడు అని శివ నారాయణ అంటాడు.

మరోవైపు నీ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని జ్యోని పారు అడుగుతుంది. అమ్మకు దీపపై ఎంత కోపం ఉందో తెలిసేలా అత్తతో వాయిస్ మెసేజ్ పెట్టాను. రిప్లై రాదని తెలుసు. దాంతో దీపను ఎలా బాధపెట్టాలో తెలుసు. కానీ, నీ సంగతే అర్థం కావట్లేదు అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో దాసు వచ్చి ఈరోజు నువ్ నాకు చాలా నచ్చావమ్మా. నువ్వెప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని దాసు అంటాడు.

పారుకు జ్యోత్స్న షాక్

పదిమందితో కలిసి ఉండేదేరా జీవితం అంటే అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024