




Best Web Hosting Provider In India 2024
రూ.90వేల వరకు జీతం- NIACL AO Recruitment 2025 రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్!
ఎన్‌ఐఏసీఎల్ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025పై బిగ్ అప్డేట్! రూ. 90వేల వరకు జీతంతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల రిజిస్ట్రేషన్‌కి ఈరోజే చివరి తేదీ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీఎల్)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30, 2025తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్‌ఐఏసీఎల్ అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది కాబట్టి, అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఎన్‌ఐఏసీఎల్ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025- ముఖ్యమైన తేదీలు, పరీక్ష వివరాలు..
ఈ పోస్టులకు మొదటి దశ (ఫేస్ 1) ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 14న, రెండో దశ (ఫేస్ 2) ఆన్‌లైన్ పరీక్ష అక్టోబర్ 29, 2025న జరుగుతాయి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ముందుగా “Click here for New Registration” అనే టాబ్‌ను ఎంచుకుని, మీ పేరు, కాంటాక్ట్ వివరాలు, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, సిస్టమ్ ద్వారా ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. ఈ వివరాలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.
ఎన్‌ఐఏసీఎల్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ జీతం నెలకు రూ. 50,925 నుంచి రూ. 90వేల వరకు ఉంటుంది.
ఎన్‌ఐఏసీఎల్ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు ఎలా చేయాలంటే..
అర్హత ఉన్న అభ్యర్థులు కింద తెలిపిన దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టెప్ 1- ముందుగా ఎన్‌ఐఏసీఎల్ అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ఓపెన్ చేయండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే “కెరీర్స్” లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు “అప్లై ఆన్‌లైన్” లింక్ కనిపిస్తుంది.
స్టెప్ 4- ఆ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 5- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 6- “సబ్మీట్” బటన్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 7- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
ఎన్‌ఐఏసీఎల్ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025- దరఖాస్తు ఫీజు వివరాలు..
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ (వికలాంగ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/-. ఈ కేటగిరీకి చెందని ఇతర అభ్యర్థులకు ఫీజు రూ.850/-. ఫీజును డెబిట్ కార్డ్స్ (రూపే/వీసా/మాస్టర్‌కార్డ్/మేస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వాలెట్స్ ద్వారా చెల్లించవచ్చు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌ఐఏసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఎన్‌ఐఏసీఎల్ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link