




Best Web Hosting Provider In India 2024

తిరుమల అప్డేట్స్ : సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు – విశేష పర్వదినాల లిస్ట్ ఇదే
శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.పూర్తి లిస్ట్ ను ఇక్కడ తెలుసుకోండి…
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే సెప్టెంబర్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి, సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని పేర్కొంది. ఇక ఇదే నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి.
సెప్టెంబర్ నెలలో జరిగే కార్యక్రమాలు:
- సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి.
- సెప్టెంబర్ 4న వామన జయంతి.
- సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
- సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం.
- సెప్టెంబర్ 10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె).
- సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య.
- సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
- సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
- సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం.
- సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 – ముఖ్య తేదీలు
• 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• 24-09-2025 ధ్వజారోహణం(శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం)
• 28-09-2025 గరుడ వాహనం.
• 01-10-2025 రథోత్సవం.
• 02-10-2025 చక్రస్నానం.
ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దవుతాయి.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 27-09-2025 రాత్రి 9 నుంచి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించాలని టీటీడీ అధికారులు నిర్ణయించన సంగతి తెలిసిందే. భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకునేలా కూడా చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం
టాపిక్