




Best Web Hosting Provider In India 2024

ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం – భద్రాచలం వద్ద 47.9 అడుగుల నీటిమట్టం
గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతిగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 47.9 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 47.9 అడుగులకు చేరినట్లు తెలిపింది.
ఇక ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇన్,ఔట్ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని… మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కృష్ణాలో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,52,567, ఔట్ ఫ్లో 3,10,512 లక్షల క్యూసెలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కూడా వరద కొనసాగుతోంది. ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం… ప్రాజెక్ట్ కు చేరుతున్న వరద 2,18,441 క్యూసెకులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,18,441 క్యూసెకులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 304.47 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు ఏపీలో ఇవాళ కూడా వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్