





Best Web Hosting Provider In India 2024

2 రోజుల్లో 16 కోట్లు దాటిన జాన్వీ కపూర్ సినిమా- రకుల్ ప్రీత్ సింగ్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బీట్ చేసిన పరమ్ సుందరి
పరమ్ సుందరి బాక్సాఫీస్ కలెక్షన్ డే 2: సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా పరమ్ సుందరి మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. రెండు రోజుల్లో రూ. 16 కోట్లను దాటవేసిన పరమ్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ మూవీని బీట్ చేసేసింది.
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఎట్టకేలకు ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ, సిద్ధార్థ్, జాన్వీ కపూర్ జంట కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద పరమ్ సుందరి సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.
పట్టు నిలుపుకున్న పరమ్ సుందరి
అలాగే, మొదటి శనివారం (ఆగస్ట్ 30) కూడా బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకోగలిగింది పరమ్ సుందరి. ట్రేడ్ సంస్థ సక్నిక్ ప్రకారం పరమ్ సుందరి మొదటి రోజు రూ. 7.25 కోట్లు సంపాదించింది. ఇది సిద్ధార్థ్ కెరీర్‌లో 5వ అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది.
రెండో రోజు కలెక్షన్స్
ఇక రెండో రోజు పరమ్ సుందరి సినిమా భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 9.22 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు పరమ్ సుందరి మూవీ కలెక్షన్స్ స్వల్పంగా పెరిగాయి. అలాగే, పరమ్ సుందరి సినిమా ఇండియాలో రెండు రోజుల్లో రూ. 16.47 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాను దాటేసి
అంటే అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రొమాంటిక్ కామెడీ మేరే హస్బెండ్ కీ బీవీ 12.85 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ కలెక్షన్లను జాన్వీ కపూర్ పరమ్ సుందరి అధిగమించింది. అయితే, పరమ్ సుందరి సినిమాను షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీతో పోల్చగా ఆ సినిమా రెండో రోజుల (రూ. 28.05 కోట్లు) కలెక్షన్స్‌కు ఏమాత్రం దగ్గరిగా లేకపోవడం గమనార్హం.
పరమ్ సుందరి నటీనటులు
ఇకపోతే పరమ్ సుందరి సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో సిద్ధార్థ్, జాన్వీతోపాటు సంజయ్ కపూర్, మంజోత్ సింగ్, ఇన్నాయత్ వర్మ, రెంజి పాణికర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
పరమ్ సుందరి కథ
స్క్రీన్ ప్లే, డల్ స్టోరీలైన్ కారణంగా పరమ్ సుందరి సినిమా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ సిద్ధార్థ్, జాన్వీల కెమిస్ట్రీ, సినిమా సౌండ్ ట్రాక్ ప్రశంసలు అందుకున్నాయి. ఢిల్లీకి చెందిన పరమ్ అనే నార్త్ ఇండియన్ కుర్రాడు ఏఐ యాప్ ద్వారా తన సోల్ మేట్ కోసం సెర్చ్ చేసి కేరళకు చెందిన సుందరి అనే సౌత్ ఇండియన్ అమ్మాయి వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే పరమ్ సుందరి కథ.
సంబంధిత కథనం