




Best Web Hosting Provider In India 2024

స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు – 10వ తేదీలోపు ఓటర్ల తుది జాబితా..!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్ పెట్టగా… ఎంపీటీసీ, జెడ్పీటీసీ తుది ఓటర్ జాబితాలను సెప్టెంబరు 10వ తేదీ నాటికి ప్రచురించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం… ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే సూచనలున్నాయి. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈసీ ఆదేశాలు – షెడ్యూల్ ఇలా…
- సెప్టెంబరు 6వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి.
- సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరించాలి.
- సెప్టెంబర్ 8వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి.
- సెప్టెంబర్ 9వ తేదీన అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి.
- సెప్టెంబర్ 10వ తేదీన తుది ఓటర్ల, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి.
ఇక రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కొద్దిరోజుల కిందటే ఖరారయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా… 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో వీటిపై ప్రకటన చేసింది.
జూన్ 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తీసుకొచ్చిన జీవోను అసెంబ్లీ ముందుకు కూడా తీసుకొచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్