





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్.. భయపెట్టే టీనేజీ గర్ల్.. సక్సెస్ ఫుల్ సీజన్ పార్ట్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ సీజన్ 2 పార్ట్ 2 ఓటీటీలోకి రాబోతుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. వణికించే సీన్లతో టీనేజీ అమ్మాయి భయపెట్టే సిరీస్ ఇది.
డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. మరికొద్ది రోజుల్లో సూపర్ నేచురల్ మిస్టరీ సిరీస్ రెండో సీజన్ పార్ట్ 2లోని మిగిలిన నాలుగు ఎపిసోడ్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి.
ఏ ఓటీటీలో?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయింది. ఆగస్టు 6 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 2 పార్ట్ 1 కూడా ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఇప్పుడు సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. ఈ పార్ట్ 2 సెప్టెంబర్ 3 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
లేడీ గాగా
ఇటీవల న్యూయార్క్ నగరంలో నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై గ్రాండ్ గాలా సందర్భంగా సింగర్ లేడీ గాగా తన సింగిల్ ది డెడ్ డాన్స్ కోసం గ్రాండ్ అనౌన్స్ మెంట్ చేసింది. వెడ్నెస్ డే సీజన్ 2 ప్రమోషనల్ డూమ్ టూర్ లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో లేడీ గాగా కూడా యాక్ట్ చేసింది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో కూడిన సీజన్ 2 పార్ట్ 1 ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఈ సీజన్ మిగిలిన భాగాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చివరి ఎపిసోడ్లు
అధికారిక ప్రకటన ప్రకారం ఐదు నుండి ఎనిమిది ఎపిసోడ్లతో కూడిన వెడ్నెస్ డే సీజన్ 2 రెండవ భాగం 2025 సెప్టెంబర్ 3 న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. యుఎస్ లో అభిమానులు చివరి నాలుగు ఎపిసోడ్లను ఉదయం 3 గంటలకు వీక్షించవచ్చని టుడుమ్ నివేదించింది. ఇండియాలో మధ్యాహ్నం ఈ పార్ట్ 2 ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.
టీనేజీ గర్ల్
వెడ్నెస్ డే సిరీస్ టీనేజీ గర్ల్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు సీజన్ 2 పార్ట్ 2లో ఆమె కుటుంబం, స్నేహితులు, అలాగే నెవర్ మోర్ అకాడమీలో కొత్త రహస్యాల ద్వారా నావిగేట్ చేస్తుంది. అలాగే అకాడమీలో మరో సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఆమె కొంతమంది పాత ప్రత్యర్థులను ఎదుర్కొంటుంది. సీజన్ 2 మొదటి భాగంలో అభిమానులు వెడ్నెస్ డే నెవర్ మోర్ కు తిరిగి రావడాన్ని చూశారు. అక్కడ అంతుచిక్కని సంఘటనలు ఆమెను తిరిగి ప్రమాదంలోకి నెట్టాయి.
సంబంధిత కథనం